ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 28 February 2013

1) తప్పు చేసిన వ్యక్తిని క్షమించగల వ్యక్తిలో మంచితనం వుంటుంది. మరి జరిగిన తప్పును చేసిన వ్యక్తిని మరిచిపోయే వ్యక్తిలో గొప్పతనం వుంటుంది.

2) పాండిత్యం పుస్తకాలు చదవడం వల్ల రాదు మరదే చదివిన దాన్ని అర్ధం చేసుకుని అవసరమైనప్పుడు అన్వయించడం వస్తే పాండిత్యం అబ్బినట్టే.

3) సాధు స్వభావానికి మించిన బలం లేదు. నిజమైన బలానికి మించిన సాధువైనది, సున్నితమైనది మరోటి లేదు. సత్యాన్ని నమ్మితే కోపంకి దూరంగా వుండాలి.

No comments: