ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

1) మాటకు మాట పలుకుకు బదులు ఇవ్వటం సులభమే. కానీ సమయ సందర్భాలు, ఉచ్ఛనీచాలు, స్థితిగతులు... అన్నిటికన్న చెప్పిన విషయంలో తత్వం ఎంత వుందో చూసుకుని ముందుకు వెళితే జీవితంలో ఎదురుదెబ్బలు తగలకుండ వుంటాయి.

2) అందాలకు బందీ కాకపొతే ప్రవరాఖ్యుడు అంటారు. అందాలకు దాసుడైతే సుందరప్రియుడంటారు. ఏమి పట్టకపోతే నిష్కాముడంటారు/విరాగి అంటారు. తెలుసుకుని మెలగండి.

3) చదివే చదువుకి దొరికే పనికి సంబంధం వుండటం లేదని మనం చదువులను కాదనగలమా. చదువు వల్ల లభించే విజ్ఞ్యానం ఉద్యోగ పర్వంలో కాకపోయిన మరోచోటో మరోచోటో తప్పక ఉపయోగపడుతుంది. చోరులెవ్వరు హరించలేనిది విద్య. విద్యరాని వాడు వింత పశువు అన్న నానుడి ఉత్తుత్తినే బలపడలేదు.

No comments: