ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

1) ఏకాగ్రత మనిషి ఆలోచనలకి శక్తి అందించి విస్పష్టమైన కల్పన ద్వారా మనసునున్న దానిని సృజిస్తుంది. ఆలోచన లేక అభివృద్ధి వుండదు.

2) ఐకమత్యంతో మన ఉనికి స్థిరపడుతుంది అలాగే విభజన మనలను పతనం పాలు చేస్తుంది. తెలిసి తెలివి మెలిగి జీవితాన ఎదగండి.

3) తెలివితేటలు వల్ల ఏ పని ఎలా చేయాలో తెలుస్తుంది, కాని సామర్ధ్యానికి ఆ పనిని ఎలా చేయాలో తెలుస్తుంది. కొన్ని అపజయాలు గెలుపు కంటే గొప్పవిగా వుంటాయి.

No comments: