ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

1) ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు కానీ ప్రతి పనిని ధ్యానంగా చెయ్యి.. జయం చేకూరుతుంది. మానసిక బంధ విముక్తిని కలిగించేదే నిజమైన విద్య.

2) ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండడమే అసలైన విద్యకు చిహ్నం. ఆలోచనల యుద్దంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు. మనిషికి మనోనిబ్బరం కంటే మరో మోక్షమార్గం లేదు.

3) మూర్ఖుని ప్రశంసలు కన్నా బుద్దిమంతుని తిట్లు మేలు. హృదయం లేని మాటల కన్నా మాటలు లేని హృదయం మిన్న. ఓర్పు చేదుగా వుంటుంది, దాని ఫలం మాత్రం పసందుగా వుంటుంది.

No comments: