ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

1) ప్రతి ఓటమికి ముఖ్య కారకమైనది భయము మరియు క్రొత్త దారి/పుంతల పట్ల విముఖత. అలాగే చేసే పని పట్ల విశ్వాసము మరియు నిబద్ధత గెలుపుకి ముఖ్య భూమిక వహిస్తాయి.

2) మన దుఃఖానికి సగం కారణం వేరొకరి నుంచి ఏదో ఆశించడమే అలాగే వేరే వాళ్ళలో మంచి చెడ్డలు ఎంచడంలో మిగిలిన సగం సరిపోతుంది.

3) చక్కని వజ్ర సమానమైన రెండు వరాలను జీవితం నేస్తాలకై అందిస్తుంది. ఒకటి పెంపు మరోటి ఎంపు. జీవితంలో నేస్తాలను పెంపు భాగ్యం నీకు అందివస్తే, ఆ పెంపులో ఎంపు చేసుకునే అవకాశం కూడా నీకే వుంది. ఎంపు బాగోపోతే నేస్తాలా పెంపులో సౌకర్యముండదు. తెలుసుకుని తెలివిగా మసులుకో.

No comments: