ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 28 February 2013

" ముగ్ధమోహనం " ( 8th chapter )

మ...న...సు...
ఆకారం లేదు....ఉనికి భౌతికం గా కనిపించదు.రక్తాన్ని నిరంతరం పంప్ చేస్తూ...అనుక్షణం కొట్టుకుంటూ వుండే హృదయమే మనసా? మెదడు పొరల్లో ,జ్ఞాపకాల అరల్లో నిలిచిపోయే ఇష్టమే మనసా?
ముగ్ధ మంచం మీద వెల్లికిలా పడుకుంది.ఎదురుగా గోడకు కార్తికేయ లైఫ్ సైజు ఫోటో.నవ్వుతూ తన వంకే చూస్తున్నట్టు. ..
"ఇప్పుడే వస్తానని వెళ్ళాడు..వెళ్లి అరగంట అయింది.ఇంకా రాలేదు".అప్పటి నుంచి అతని ఆలోచనలే..తను తన స్నేహితురాలిని మిస్ అయిన విషయం కూడా మర్చిపోయింది.
రాత్రి తన పైట సరిచేచేస్తూ...వుండగా తన హృదయ భాగాన్ని అప్రయత్నం గా తాకినా అతని చేతివ్రేళ్ళ స్పర్శ... మంచు వెన్నల్లో ,చుట్టేసిన తొలి నులి వెచ్చని సూర్యోదయ కిరణాల ఆలింగనం లా వుంది.
తన నుదురుని చుంబించిన అదర చుంబనం గులాబీని ముద్దేట్టుకున్న నిహారికా బిందువు లా తోచింది.
తను కృష్ణశాస్త్రి అయితే ఎంత బావుండు?
తను తిలక్ లా మారిపోతే?
కీట్స్ పోయెట్రీ తనే అయితే?
వెల్లికిలా పడుకుని ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తే ఆ అబ్బాయి ప్రేమలో పడ్డట్టే....
వెంటనే బోర్లా పడుకుని చుబుకానికి రెండు చేతులు ఆన్చి మళ్ళీ కార్తికేయ ఫోటో వైపు చూసింది.
బోర్లా పడుకుని,చుబుకానికి చేతులు ఆన్చి అబ్బాయి ఫోటో వంక చుస్తే "ఆ అబ్బాయి ఆలింగనం లో కరిగిపోవాలన్న కోరిక ఉన్నట్టే ...
తల విదిల్చి లేచి కూచుంది.
ఏమైంది తనకీ వేళ?
కార్తికేయ ఫోటో వైపు చూసింది.
పెరట్లో.వున్న గులాబీ పువ్వులన్నీ ఆమె బుగ్గల్లోకి వచ్చి చేరాయి.
****** ******* ********
కాలింగ్ బెల్ మోగింది.తన గుండెల్లో గంట మోగినట్టు...
ఎదురుగా కార్తికేయ.అతని చేతిలో కవర్.ముగ్ధ చేతిలో పెట్టాడు.
"ఏమిటివి ?అడుగుతూనే కవర్ ఓపెన్ చేసింది....
"చీర...కాదు చీరలు...గులాబీలలో ఎన్ని రంగుల రకాలు వున్నాయో..అన్ని చీరలు...
"నాకా ఎందుకు?ఆనందం..బిడియం...కలగలిసిన ప్రశ్న
"నేను కట్టుకుంటే బావోదు కదా "చిన్న నవ్వు నవ్వి..."సారీ..."అన్నాడు.
"శారీ " అనాలి ....అనాలనుకుంది సరదాగా...కానీ అనలేదు....కార్తికేయ ఫీలింగ్స్ ని అనుభూతిస్తోంది.
************ ************** ******************
ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది మోహన...
క్యాబ్ ని పిలిచింది.అడ్రస్ .చెప్పింది ..యాసికి కి ఫోన్ చేసింది.
మధ్యలో ఓ హోటల్ దగ్గర ఆగింది.లోపలి వెళ్ళింది.తిరిగి వచ్చేప్పుడు చుడీదార్ లో వచ్చింది.
క్యాబ్ డ్రైవర్ ముందు ఆశ్చర్యం గా, ఆ తర్వాత భయం గా చూసాడు.ఆ భయాన్ని పసిగట్టింది మోహన.
భయం రెండు రకాలు...ఒకటి మనసులోనే దాచుకుని కామ్ గా వుండడం ...
రెండు ఎవరికైనా చెప్పడం...పోలీసులకు
ఇన్ఫామ్ చేయడం..
ఆ క్యాబ్ డ్రైవర్ మొహం లో రెండో భయాన్ని చూసింది.
తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పవచ్చు...రేపు తన యాభైయేళ్ళ గెటప్ విషయం అమెరికా నుంచి ఇండియా కు వస్తే తన రూపాన్ని గుర్తుపట్టే ఏకైక సాక్షి.
సాక్ష్యాన్ని చంపాలంటే ,ఆ సాక్షిని.....
సరిగా పదిహేను నిమిషాల తర్వాత కారు...పార్లమెంటు భవనానికి రెండు కిలోమీటర్ల దూరం లో ఆగింది.
కారు దిగి మరో క్యాబ్ ని పిలిచి కూచుంది. మొదటి క్యాబ్ రోడ్డు మధ్యలో ఆగి వుంది.క్యాబ్ డ్రైవర్ తల స్టీరింగ్ మీద వాలిపోయి వుంది.
అతను చనిపోయి రెండు నిమిషాలు అవుతుంది.
************* ************* **********
ఒక్క క్షణం అలానే చూస్తోండి పోయాడు....పింక్ కలర్ చీర లో చాలా అందం గా వుంది.ఎప్పుడూ ఇలా అమ్మాయిలను పరీక్షగా చూసింది లేదు. అతని చూపుల స్పర్శ ఆమె హృదయాన్ని తాకింది.
"మా ఫ్రెండ్ కలిసిందా ?అడిగింది టాపిక్ డైవర్ట్ చేస్తూ....
"లేదు...రింగవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు..మీరేం కంగారు పడకండి.'ఈవెనింగ్ లోగా మీ ఫ్రెండ్ దగరికి చేర్చే పూచీ నాది.మనమిప్పుడు ఓ వ్యక్తీ ని కలవడానికి వెళ్తున్నాం."చెప్పాడు.
"ఎవరు?ఏమిటి?ఎందుకు ?లాంటి ప్రశ్నలు అడగలేదు.అతని వెంట నడిచింది.
రాముని వెంట నడిచిన సీత లా ...
************* **************** ************************
కారు వెళ్తోంది.గమ్మత్తుగా వుంది ముగ్ధకు...
తనిలా ఒక వ్యక్తీ తో కలిసి....డ్రైవ్ చేస్తోన్న కార్తికేయను అలాగే చూస్తోండిపోవాలని అనిపించింది.
"మీరు ఏమనుకోనంటే ఒకటి అడగనా ?
"అడగండి "
"ఇంత పొద్దునే చీరలు...?అని ఆగింది.
"ఏ షాప్ కు కన్నం వేశానని అనుకుంటున్నారా?
"ఛ...ఛ నా ఉద్దేశం అది కాదు..."
"మీరు నవ్వనంటే చెబుతాను...పొద్దున్నే షాప్ కు వెళ్లి.బోర్డు మీద ఫోన్ నంబర్ చూసాను...ఫోన్ చేసాను."ఐశ్వర్యా రాయ్ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను."..అని చెప్పాను.పెద్ద బేరమే అని పరుగున వచ్చాడు...షాప్ తీసాడు...నేను వెళ్లి నాకు కావాల్సిన చీరలు తీసుకున్నాను...వాడింకా ఐశ్వర్యా రాయ్ కోసం చూస్తూనే వున్నాడు."
మనస్ఫూర్తిగా నవ్వింది.సీరియస్ గా కనిపించే కార్తికేయ లోని..అల్లరి నచ్చింది.
చాలా మంది మగాళ్ళ లో కనిపించే "ఈగో" కార్తికేయలో మచ్చుకైనా కనిపించదు.
************* ************ ***********
కారు సడెన్ గా ఆగింది.జనం గుమిగూడి వున్నారు.కార్తికేయ కారు దిగి జనాన్ని తోసుకుని వెళ్లి చూసాడు.క్యాబ్ డ్రైవర్ శవం....మోహన చేతిలో చచ్చిన డ్రైవర్ శవం.
అది ఆత్మహత్య కాదని తెలుస్తోంది.బాడీ నీలం రంగులోకి మారింది.
సరిగ్గా అపుడే యాసిక్ అక్కడికి చేరుకున్నాడు.అతను కార్తికేయ కారును ఫాలో అవుతూ వస్తున్నాడు.ఇదే మంచి అవకాశం ...అతని చేతిలో యాసిడ్ బాటిల్ రెడీగా వుంది.

No comments: