ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 28 February 2013

" ముగ్ధమోహనం " ( 9th chapter )
"ఈ ప్రయాణం ఇలానే కొనసాగితే ఎంత బావుంటుంది.దేవుడా...నా కోసం నేనెప్పుడూ ఏదీ కోరలేదు...ఎందుకో ఇప్పుడు నిన్నో కోరిక కోరాలని వుంది..."
కళ్ళు మూసుకుంది....ఒక ఉద్వేగ కెరటం....కనురెప్పను కన్నీటి చుక్క తో "కుశలమా...నాకిక సెలవా..."అని కుశలం అడిగింది.
"నా మనసును ఆకాశంలా చేసి..నా శరీరాన్ని ఇంద్రధనుస్సులా మార్చి..నా స్వరాన్ని ...సర్వాన్ని, సమస్త భావోద్వేగాలను అతని పరం చేసే వరమివ్వు ప్రభూ...."
ఆమె ఇంకా కళ్ళు మూసుకునే వుంది.
యాసిక్ కారు దగ్గరికి వచ్చాడు....కారు గ్లాసెస్ కిందికి దించే వున్నాయి.అతని కుడి చేతిలోని యాసిడ్ బాటిల్ గాల్లోకి లేచింది.
"కళ్ళు తెరిస్తే ఆ దేవిడికి తన నివేదన చేరదేమో..."అన్నంత ఇష్టంగా మూసిన కళ్ళు కలలను ఆహ్వానిస్తున్నాయి.
క్షణం లో వెయ్యో వంతు చాలు...ఆమె మొహం యాసిడ్ తో వికృతమవ్వడానికి.
************* *********************** ********************
అప్పుడే ఓ సంఘటన జరిగింది.వెనక నుంచి అరుపులు...చోర్...చోర్...దొంగ..దొంగ..
ఓ ముప్పయ్ ఏళ్ళ యువకుడు హ్యాండ్ బాగ్ తో పరుగెడుతున్నాడు . వెనగ్గా ఓ అరవై సంవత్సరాల మహిళ తన చేతిలో వున్న కుక్కపిల్లను కంట్రోల్ చేస్త్తూ , ఆ దొంగతో పరుగెత్తలేక అరుస్తోంది. ఆ దొంగ కార్తికేయ కారు దగ్గరికి వచ్చాడు.కారు డోర్ సమీపం లో యాసిడ్ బాటిల్ తో యాసిక్ రెడీ గా వున్నాడు.దొంగ యాసిక్ ని నెట్టుకుంటూ పరుగెత్తాడు.
ముసలావిడ చేతిలో వున్నా కుక్క పిల్ల ఆ దొంగ వెంట పడాలని కిందికి దూకింది.
అదే సమయంలో దొంగ యాసిడ్ ని గుద్దుకుంటూ పారిపోవడం తో అతని చేతిలోని యాసిడ్ బాటిల్ అటు పరుగెత్తుకు వచ్చిన కుక్క పిల్ల మీద పడింది.యాసిడ్ బాటిల్ లోని యాసిడ్ మీద పడ్డం తో కుక్క పిల్ల శరీరం ఒక్క సారిగా కాలి.పొగలు వచ్చాయి.
మనిషి శరీరాన్ని పరమ వికృతం గా మార్చే యాసిడ్.
క్షణాల్లో జరిగిన సంఘటన ...రోడ్డు మీద బాధ తో విల విల కొట్టుకుంటుంది కుక్క పిల్ల.
కార్తికేయ క్షణం లో జరిగింది ఊహించాడు.పారిపోతున్న యాసిక్ ని గుర్తించాడు.ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ యాసిడ్....ఆ పైన ఊహించలేకపోయాడు.
అప్పటి వరకు తన ఊహా ప్రపంచం లో వున్న ముగ్ధ జరిగిన సంఘటనతో షాక్ తింది.
కార్తికేయ ఆ కుక్క పిల్లని తన చేతుల్లోకి తీసుకున్నాడు.ఆ ముసలావిడ తన హ్యాండ్ బ్యాగ్ సంగతి వదిలేసి కుక్క పిల్ల గురించి ఆందోళన పడుతుంది....కార్తికేయ కారులో వున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసాడు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అటుగా వెళ్తోన్న ఓ క్యాబ్ ని పిలిచి ఆ ముసలావిడను ఆ క్యాబ్ లో ఎక్కించి, హాస్పిటల్ కు తీసుకువెళ్ళమని చెప్పి క్యాబ్ అతని కి కొంత డబ్బు ఇచ్చాడు.
ఆ ముసలావిడ కార్తికేయ వంక కృతజ్ఞతాపూర్వకం గా చూసింది..
**************** ****************** **********************
ఇంకా ఆ షాక్ లో నుంచి కోలుకోలేదు ముగ్ధ.అసలేం జరిగింది? డ్రైవ్ చేస్తోన్న కార్తికేయ వంక చూసింది. చాలా సీరియస్ గా కనిపించాడు. అతని మొహం ఎర్ర్రబడింది.ముగ్ధ మీద ఎటాక్ కు ప్లాన్ జరిగిందని అర్ధమైంది.
********* *********************** *******************
కారు రాణా సర్కిల్ దగ్గర ఆడింది. ఓ పక్కన కారు పార్క్ చేసి వస్తుంటే అంజలి ముగ్ధ దగ్గరి కి వెళ్ళింది గులాబీ బుట్టతో.
"మేడం ఈ గులాబీలు మీ జడలో వుంటే ఇంకా అందంగా వుంటాయి "
అంజలి వంక చూసింది.ఇంత చిన్న అమ్మాయి...పూలు అమ్ముకుంటూ....వూళ్ళో గులాబీ తోటే...ఇక్కడ ఉలాబీ పువ్వు కూడా కొనుక్కోవాలి.మార్పు యాంత్రికమైన అభివృద్ధి వైపు పయనిస్తుందా?
ముగ్ధ వంగి " ఇంత చిన్న వయసులో...ఇలా పూలు అమ్ముకునే బదులు చదువుకోవచ్చుగా " అనునయం గా అంది.
'పూలు అమ్ముకుంటూ,చదువుకుంటున్నాను మేడం "చెప్పింది అంజలి.
"పూలు అమ్ముకుంటూ చదువుకోవడం ఏమిటి? మీ అమ్మా,నాన్న ?
"లేరు "సమాధానం కార్తికేయ నుంచి వచ్చింది.
*************** **************** **********************
"అదీ జరిగింది...నేను చంపబోతుంటే ,నిన్ను అడ్డు పెట్టుకుని తప్పించుకున్న వ్యక్తీ చేతిలో అంజలి అమ్మా,నాన్న చనిపోయారు.ఇప్పుడు తను ఒంటరి.నేను రమ్మని పిలిచినా రాలేదు.వయసులో చిన్నదే...ఆత్మాభిమానం లో పెద్దది.తల్లిదండ్రులు చేసే పూల వ్యాపారాన్ని కొనసాగిస్తుంది.కొంత డబ్బును పక్కనే వున్న అనాథ శరణాలయం లోని పిల్లల కోసం ఖర్చు చేస్తుంది.
ముగ్ధ అంజలిని దగ్గరికి తీసుకుంది.కళ్ళ కింద నల్లటి చారికలు.గుండెలకు హత్తుకుంది.
"నాతో మా వూరికి రారాదు.నాకో తమ్ముడు వున్నాడు...చెల్లెలు లేదు.."చెప్పింది ముగ్ధ.
అంజలి కార్తికేయ వైపు చూసింది."మారణ హోమం "జరగాలి...అన్న భావం కనిపించింది.
అంజలి జీవితం లో జరిగిన విషాదం తలచుకుంటుంటే బాధగా వుంది.
************* ************************ ********************
"క్షమించండి "అంది కారు లో తిరిగి వస్తున్నప్పుడు.
"ఎందుకు ? కారు డ్రైవ్ చేస్తూనే అడిగాడు కార్తికేయ.
"మనుష్యులను చంపడం పాపం కదా అన్నాను...క్రూర మృగాలను వేటాడి చంపడం క్షత్రియ లక్షణం ...రాజ లక్షణం....చంపేయండి..."మనస్ఫూర్తి గా చెప్పింది ముగ్ధ.
అతని భుజం మీద తల వాల్చింది .అలిసిన ఆ కళ్ళు కాసింత విశ్రాంతి ని కోరుకుంటున్నాయి.
అప్పుడే కార్తికేయ ఫోన్ రింగ్ అయింది.ముగ్ధ స్నేహితురాలి దగ్గరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అది.
******************* ******************* **************
"వెల్ ...చేతిలో యాసిడ్ బాటిల్ వున్నా పారిపోయి వచ్చావా ? "చేతిలో వున్న ఆపిల్ ని నైఫ్ తో ముక్కలుగా కోస్తూ యాసిక్ వంకే చూస్తూ అడిగింది.
"కొద్దిలో మిస్ అయింది మేడం " యాసిక్ చెప్పాడు.
మోహన గోడ వైపు తిరిగి వెనక్కి చూడకుండానే చేతిలోనే నైఫ్ ని విసిరింది.యాసిక్ వైపు టార్గెట్ చేస్తూ....ఆ నైఫ్ గాలిని చీల్చుకుంటూ యాసిక్ వైపు వస్తోంది.

No comments: