ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

A)
మీ హార్ట్ బీట్ పెంచే రొమాంటిక్ థ్రిల్లర్ ." ముగ్ధమోహనం".
ముగ్ధమోహనం సీరియల్...కౌంట్ డౌన్ మొదలైంది.
...........
నా పేరు ముగ్ధ..కోనసీమ ఒడిలో పెరిగిన నేను తెల్లవారక ముందే కోయిల కూజితంతో నిద్ర లేస్తాను....
ఇంటి ముందు ముగ్గుతో సూర్యుడి లేలేత కిరణాలను ఆహ్వానిస్తాను.
అమ్మ నేర్పించిన ఇంటి పని..నాన్న వినిపించే భగవద్గీత...
తమ్మితో కలిసి జామచెట్టెక్కి చిలుక కొరికిన జామకాయలు కోసుకోవడం ...ఇదే నా ప్రపంచం..
అట్లాంటి నా ప్రపంచం లోకి ఓ ఉదయం పోలీసులు వచ్చారు....
నేనో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని అన్నారు...ఇంటర్ పోల్ నా గురించి వెతుకుందిట ..రెడ్ కార్నర్ నోటీస్ ఉందిట...'
మా నాన్న కుప్పలా కూలి పడిపోయారు..
నాకేడ్పు వస్తోంది.
నన్ను కాపాడే వారే లేరా ?
"విసురజ" ముగ్ధ మోహనం
జనవరి 26 నుంచి ప్రారంభం.
B)
మీ హార్ట్ బీట్ పెంచే రొమాంటిక్ థ్రిల్లర్ ." ముగ్ధమోహనం
స్థలం ...ఉగ్రవాదుల దాడిలో కుప్పకూలిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు కూతవేటు దూరం ...
నా పేరు మోహన...
ఐ హావ్ నో సెంటిమెంట్స్ ......
బ్లడ్ అన్నా, బ్లడీ మనీ అన్నా నా కిష్టం.
నా రివాల్వర్ మేగజైన్ లో బుల్లెట్స్...నా చూపుల్లోని మిస్సయిల్స్ ఎప్పుడూ శత్రువులను టార్గెట్ చేస్తూనే వుంటాయి.
"ది మోస్ట్ డేంజరస్ లేడీ"గా పేరున్న నన్ను "ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్"లో నిలదీసిన ఒకే ఒక మగాడు...
అతన్ని ఇప్పుడు టార్గెట్ చేసాను... నా మైండ్ గేమ్ పవర్ ఏమిటో చూపిస్తాను...
అన్నట్టు మీకు ముగ్ధ అనే అమ్మాయి గురించి తెలుసా ?
జనవరి 26 నుంచి ప్రారంభం.
( ఈ సీరియల్ పై సినీ హీరో మరియు హీమాన్ "సుమన్" ఏమంటున్నారు? ప్లీజ్ వెయిట్ )
www.manrobo.netరొమాంటిక్ థ్రిల్లర్. "ముగ్ధ మోహనం")
................................
C)
మంచులో స్నానిస్తూ, నిహారికా బిందువులతో తడిసి ముద్దయి....ఒంటరిగా నా ప్రపంచంలో నేను విహరిస్తోన్న వేళ...
నా ఎదుట నిలబడిన ముగ్ధత్వాన్ని చూసి...కల ...కల " వరమై "..కలవరమైన వేళ ..ఆమె
"బీతహరిణి"...
మృత్యుఘంటికల మధ్య ప్రాణాలకై చేయు పరుగు పందెం.
అప్పుడే ఎదురైంది....మోహన..
ఇప్పుడు నేను భావుకుడిని కాదు...ఆయుధం ఎక్కుపెట్టిన సైనికుడిని....
ఇంతకీ నేనెవరో చెప్పనేలేదు కదూ...నా పేరు 'కార్తికేయ'.
ఎవరీ ముగ్ధ..
ఎవరీ మోహన..
కోనసీమ పల్లె తరుణికి ....
ఉగ్రవాద మానవబాంబుకి ఏమిటి సంబంధం ?

No comments: