ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

1) ముత్యపు చిప్పలోని ముత్యం సముద్రం అడుగుబాగాన దాగి ఉన్నట్టే, వ్యక్తుల్లోని ప్రావీణ్యత కూడా అట్టడుగునే దాగి వుంటుంది. దానిని కనిపెట్టి వెలికి తీయాలి, ప్రజ్ఞ్యావంతులకు అవకాశం ఇస్తే తప్పక తమ నేర్పును రుజువుచేసుకుంటారు.

2) మనిషి తన జీవితం క్షణికమని బాధపడతాడు, కాని జీవితంలో తను ఎన్ని క్షణాలు వృధా కావిస్తున్నాడో గమనించడు. ఉన్నది చాలనుకోవడం సుఖం, లేని దానికోసం మధనపడడం దుఃఖం.

3) మన సామర్ధ్యాన్ని బట్టి మనం మనల్ని అంచనావేసుకుంటాం, మనం సాధించిన విజయాల్ని బట్టి బయటవాళ్ళు మనల్ని అంచన వేస్తారు. విజయానికి అందరు మిత్రులే.

No comments: