ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

శ్వేత నీటికలువ పూరెక్కలతో విరిసి మెరిసే తళతళ
కలువరాణి రూపుగని శశి హృదయం మురిసే ఇంచక్కా
చందనాలు జల్లే కలువరాణి సుమసుగంధాలు ప్రియుని ఎదలో
నీటికలువలు నెలబలుడితో ప్రేమ మంతనాలు మనసార నెరిపే
వలపుబాటలో గెలుపుతోటలో విహారాలు కావాలా
చెలిమిని పంచి పెంచే కలువలతో కూరిమి చేయిండిక
పున్నమి చంద్రుడు వెలుగులతో పంచే పుడమిన పండు వెన్నెల
తారలే సాక్షిగా ధవళవస్త్రరాణితో పొందుకై నేలపై పరచే తెల్లనిపక్క
కలువల వయ్యారం వెన్నెలరాజు చంద్రునికే సొంతంలే
కులకాంతల సింగారం గృహరాజు మగనికే చెందునులే
విసురజ

No comments: