ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 28 February 2013

ఓ నా మనసులోని మనసా
నా మది నీదని నీకింత అలుసా
...
కన్నుల్లోని కలలు.. నీ కోసం
బుగ్గల్లోని కెంపులు..నీ కోసం
పెదాల ఎరుపులు..నీ కోసం
ఎదలో మమతలు..నీ కోసం

తనువు తహతహలు..నీ కోసం
తలపు తలగడలు..నీ కోసం
వలపు వింజామరలు..నీ కోసం
ప్రాయపు పకపకలు..నీ కోసం

కలిసాయి చూపులు ఏనాడో నీతో
నిదురలేదు నాకంటికి నాటితో
..
నదుల గలగలలు..నీ కోసం
జతుల లయతళాలు..నీ కోసం
శబ్దాల తరంగాలు..నీ కోసం
గతుల గమకాలు..నీ కోసం

పైటల విసురులు..నీ కోసం
సోకుల సొబగులు..నీ కోసం
పయ్యెదల పిలుపులు..నీ కోసం
సోయగాల సకిలింపులు..నీ కోసం

ఊహల్లోని సుందర రూపమా
ఊరించకిక దరి చేరరావ నేస్తమా
....
రూప విలాసాలు..నీ కోసం
దీప కాంతిరేఖలు..నీ కోసం
ధూప పరిమళాలు..నీ కోసం
మది మురిపాలు..నీ కోసం

హృదిలో సరాగాలు..నీ కోసం
కళ్ళల్లో మెరుపులు..నీ కోసం
తరుణి తమకాలు..నీ కోసం
గదిలో పాలగ్లాసు..నీ కోసం

మనసుమాట మగరాజ తెలుసుకో
మదిరాజ్యాన్ని మహారాజా ఏలుకో
....
వయసు దివిటీలు..నీ కోసం
మనసు మతాబులు..నీ కోసం
వెన్నెల వెలుగులు..నీ కోసం
చెలిమి చిచ్చుబుడ్డీలు..నీ కోసం

చెవుల లోలకులు..నీ కోసం
ముక్కున ముక్కెరలు..నీ కోసం
కొప్పున కొండమల్లెలు..నీ కోసం
నడుము నయగారాలు..నీ కోసం

మగటిమి నీదే దొర రాజకుమార
కలిమి లేమి ఏదైనా నీతోనే సుకుమార
.....

జాబిలి పాడిన జావళి..నీ కోసం
జామురాతిరి జాగారం..నీ కోసం
జలధి అందించే ముత్యాలు..నీ కోసం
జవ్వని మదన సింగారాలు..నీ కోసం

ముద్దుకో ముద్దు..నీ కోసం
మమతల సద్దు..నీ కోసం
పసిడికిరణాల పొద్దు..నీ కోసం
సమాజాంక్షలు రద్దు..నీ కోసం

ఓ నా మనసులోని మనసా
నా మది నీదని నీకింత అలుసా
.....
విసురజ

No comments: