ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

కవిత: నీకైలే....నీవేలే
..............
వేల్పులే వయ్యారాన్ని తరగని కలిమిగా అందిస్తే ..అది నీవేలే చెలి
సోకులే సోంపు సింగారాన్ని రూపానికి అద్దితే.. అది నీకేలే చెలి
వెన్నెలే వలపు పాన్పును పూలతలపై పరిస్తే..అది నీకైలే చెలి
పెదాలే మక్కువమీర అనురాగ కావ్యాలు వల్లిస్తే..అది నీకోరకేలే చెలి
సైగలే మూగబాషలో సన్నుతి రాగం ఆలపిస్తే .అది నీకైలే చెలి
పదాలే ఎదకు ప్రేమ గీతమాలికను కూర్చి అందిస్తే..అది నీకోసమేలే చెలి
వెలుగే చూపుల వాడిని రవికిరణాల వేడికి అంటిస్తే..అది నీ పనేలే చెలి .
వగలే దోరవయసు అందాలకు సొబగుల సాన పెడితే..అది నీ కొరకేలే చెలి
పరువే ప్రాణం పోసుకున్న ప్రతిమ రూపం పొందితే..అది నీదేలే చెలి
తలపే విభ్రమ తరుణీ రూపం అవధరించడం జరిగితే..అది నీవేలే చెలి
తనువే తహతహల తాత్పర్యానికి అర్ధాలు అడిగితే..అది నీవే చెప్పాలే చెలి
మెరుపే నీలిమబ్బుల పొట్ట చీల్చుకుని నింగిన మెరిస్తే..అది నీకైలే చెలి .
చినుకే మేఘబాల తాళలేని హృదయభార చిహ్నమైతే..అది నీకోసమే చెలి
కవితే మనసునూరు మమతల ఫలితార్ద కృతమైతే..అది నీ కొరకేలే చెలి
మనసే మనోవేగాన మరుమల్లెల వానతో చేరవస్తే.. అది నీకైలే చెలి
విసురజ

No comments: