ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

"చిన్నపాటి ప్రకంపనం..ఢిల్లీ నగరం నిద్రలోకి జారుకున్న సమయం..అర్థరాత్రి ఒంటి గంట దాటింది. కిటికీలో నుంచి వీచే చల్లగాలిని ఆహ్వానిస్తూ, ఏసీకి గుడ్ బై చెప్పాను .
కీ బోర్డు మీద చేతివేళ్లు కదులుతున్నాయి, తెల్లవారితే ఈ అక్షరాలూ వూపిరిపోసుకుని లక్షలాది చదువరులను పలకరిస్తాయి....కొంచెం కలవరం, కాస్త కంపనం.
"ముగ్ధమోహనం" నా తొలి కాల్పనిక రచన..ఆ మాటకొస్తే రచయితగా నా తొలి ప్రయత్నం..నిశ్శబ్దంగ నా ప్రపంచంలో..నాతో చెలిమి చేసే కవితలతో ముచ్చట్లాడుతూ, మ్యూజింగ్స్ (MUSINGS GROUP) లో షేర్ చేసుకుంటూ, కదిలే కాలంతో పాటు నడిచే అక్షర బాటసారిని . ఒక ఆన్ లైన్ మేగజైన్ లో "డైలీ సీరియల్"..రాయడమంటే..."ఒక ముడిని వేస్తూ, మరో ముడిని విప్పుతూ, పాత్రల మధ్య వైవిధ్యాన్ని మిస్సవ్వకుండా రాయాలి. రచయితకు స్వేచ్చ అపారమే...కానీ పాత్రలు రచయితను డామినేట్ చేస్తాయి. కథా కథన కుతూహలం వీక్షకులను మెస్మరైజ్ చేయాలని నా తపన. ఇదంతా నాకు సాధ్యమా, వీలయ్యే పనేనా.
కస్టమ్స్ అధికారిగా ఉద్యోగ నిర్వహణ వేరు...రచయితగా రూపెత్తి వేలాది/లక్షలాది చదువరులను ఆకట్టుకోవాలంటే కొంచెం కంగారు. ఢిల్లీ అత్యాచార సంఘటన ఇంకా నా స్మృతి పథం నుంచి కనుమరుగవ్వలేదు . క్రైమ్ రేటింగ్....అత్యాచార సంఘటనల పునరావృతం...ఇవ్వన్నీ ఆందోళన కలిగించే విషయాలు.వీటిని కలగలిపిన అల్లికతో..స్వచ్చమైన అమాయకపు అమ్మాయి (ముగ్ధ) పాత్రతో......
మోస్ట్ పవర్ ఫుల్ పాయిజన్/విషకన్య లాంటి ప్రతినాయికతో "డీ" కొట్టే హీరోదాత్త (కార్తికేయ) పాత్రతో చేసిన ప్రయోగమే ఈ "ముగ్ధమోహనం". నా ఆలోచనల్లో ఊపిరి పోసుకున్న "ముగ్ధ" పాత్ర నన్ను డామినేట్ చేసింది, హాంట్ చేసింది, కలవర పెట్టింది. ఫస్ట్ చాప్టర్ రాసేప్పుడు ఒక చిన్నపాటి ఉద్వేగం. ముగ్ధ పాత్రతో నాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయా....ముగ్ధ కుసుమారమైన కన్యకామణితో ప్రేమలో పడని వారెవరు..?.

No comments: