ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

కవిత: స్త్రీ/నారీ దక్షత

..........
దక్ష సమాజపు నవ నిర్మణానికి
తొలి తొలి యిటుకైన కుమారి నారీ నీవే
సృష్టిని పురోగమించి విశ్వమయం చేసిన
ఆదమ తో సంగమించిన ఈవ్ సుందరివి నారీ నీవే
సహజీవన సుందర యుగళగానంలో
మధుర రాగాన గీతాలాపన చేసింది నారీ నీవే
బ్రతుకున పలికిన జీవిత రసరమ్యవీణపై
శ్రుతిగ అనురాగ తంత్రులను మీటింది నారీ నీవే
ప్రేమను పంచి ప్రమోదము హెచ్చించే
కంటికి కనిపించే వేలుపువి నారీ నీవే
తొలిలో పుట్టినింట అందర్ని అలరించి
అసమాన దీప్తివి అల్లరి జావళివి నారీ నీవే
వివాహబంధముతో మెట్టినింటిలో అడుగిడి
వెన్నెల వెలుగులు ప్రసరించే జాబిలివి నారీ నీవే
సౌరభాల గుభాళింపులతో వెలిగింది
తరతరాలకు తీరని వెలుగై నిలిచింది నారీ నీవే
కుటుంబభారాన్ని మోసే సహభాగివి
తనవాళ్ళకై నిత్యం తపించే తరుణీమూర్తివి నారీ నీవే
తనవారికి జీవితంలో చేయూతగా నిల్చి
పైకిరాటానికి వారందరికి తోడ్పడేది నారీ నీవే
కనబడని భగవంతుని రూపంగా వుండి
తేడలేక అందరిని ప్రేమించే అమ్మవి నారీ నీవే
అత్తగా, వదినగా, పిన్నిగా, చెల్లిగా అక్కగా
ఇలా ఎన్నెన్నో రకాల పాత్రధారిణివి నారీ నీవే
కుటుంబ పురోగమన యంత్రమునకు
ముడిసరుకై వనితల గొప్పను చాటింది నారీ నీవే
న స్త్రీ స్వాతంత్ర మర్హ్యతి అన్న పాత నానుడిని
తోసి రాజన్నది దాన్ని తిరగరాసింది నారీ నీవే
నవతరం వనితగా చదువులలో/ఉద్యోగలలో
ఎనలేని పేరు కీర్తి గాంచినది నారీ నీవే
వ్యవహార కుశలముతో విదేశాల్లో సైతం
మన భారతదేశ ప్రతిష్టను పెంచినది నారీ నీవే
అటువంటి నారీ శిరోమణికి అన్నింటా తానూండి
జయకేతనం ఎగురవేసే ఓ నారీ నీకు వందనం

No comments: