ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

మీ హార్ట్ బీట్ పెంచే రొమాంటిక్ థ్రిల్లర్ ." ముగ్ధమోహనం". ముగ్ధమోహనం సీరియల్...కౌంట్ డౌన్ మొదలైంది.
...........
ముగ్ధ మోహనం
.................
నా పేరు ముగ్ధ...కోనసీమ ఒడిలో పెరిగిన నేను తెల్లవారక ముందే కోయిల కూజితం తో నిద్ర లేస్తాను....
ఇంటి ముందు ముగ్గు తో సూర్యుడి లేలేత కిరణాలను ఆహ్వానిస్తాను.
అమ్మ నేర్పించిన ఇంటి పని..నాన్న వినిపించే భగవద్గీత...
తమ్మిది తో కలిసి జామ చెట్టెక్కి చిలుక కొరికిన జామకాయలు కోసుకోవడం ...ఇదే నా ప్రపంచం..
అట్లాంటి నా ప్రపంచం లోకి ఓ ఉదయం పోలీసులు వచ్చారు....
నేనో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని అన్నారు...ఇంటర్ పోల్ నా గురించి వెతుకుందిట ..రెడ్ కార్నర్ నోటీస్ ఉందిట...'
మా నాన్న కుప్పలా కూలి పడిపోయారు..
నాకేడ్పు వస్తోంది.
నాన్ను కాపాడే వారే లేరా ?
"విసురజ" అక్షర విశ్వరూపం ..
ముగ్ధ మోహనం
జనవరి 26 నుంచి ప్రారంభం.
మీ హార్ట్ బీట్ పెంచే రొమాంటిక్ థ్రిల్లర్ ." ముగ్ధమోహనం

స్థలం ...ఉగ్రవాదుల దాడిలో కుప్పకూలిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు కూతవేటు దూరం ...
నా పేరు మోహన...
ఐ హావ్ నో సెంటిమెంట్స్ ......
బ్లడ్ అన్నా, బ్లడీ మనీ అన్నా నా కిష్టం.
నా రివాల్వర్ మేగజైన్ లో బుల్లెట్స్...నా చూపుల్లోని మిస్సయిల్స్ ఎప్పుడూ శత్రువులను టార్గెట్ చేస్తూనే వుంటాయి.
"ది మోస్ట్ డేంజరస్ లేడీ " గా పేరున్న నన్ను "ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ " లో నిలదీసిన ఒకే ఒక మగాడు...
అతన్ని ఇప్పుడు టార్గెట్ చేసాను... నా మైండ్ గేమ్ పవర్ ఏమిటో చూపిస్తాను...
అన్నట్టు మీకు ముగ్ధ అనే అమ్మాయి గురించి తెలుసా ?

No comments: