ఢిల్లీ గ్యాంగ్ రేప్ భాదితురాలికి అశ్రు నివాళి
....................................................
దేశ రాజధానిలో అయ్యో నగర నడిబోడ్డులో
అబలపై నిర్మల నిర్భయపై కాముకల బలాత్కారం
అనాదిగ ప్రేమ శాంతులకు ప్రతీకైలైన భారతవనిలో
ఏమైపోయింది మన సంస్కారం ఎందుకొచ్చే ఈ రాక్షసత్వం
రక్తాశ్రువులు చిందేలా భరత మాత గుండెలు స్రవించేలా
ఏమీ అరాచకత్వం యేల ఈ కామపైత్య ప్రకోపతత్వం
ఎటుపోతోంది సమాజహిత సౌలభ్యం జనులకేల విరాగం
స్త్రీలు కాముక వస్తువులు కారనే వాస్తవాన్ని తెలియరేం
.....................................
నీవు సమిధై నిర్భయ మాలో నిర్భయతత్వానికి నిద్రలేపావు
సర్వులకు స్త్రీల మానసంరక్షణకై సమాజహితంపై జాగృతి తెచ్చావు
దేశ సంస్కృతి పునాదుల్ని దేశ ప్రజల మనోభావాల్ని కదిలించావు
సంఘటిమై సంఘహితంకై సర్వజనులచే ఐక్యంగ పోరాటం చేయించావు
నీ ఆత్మసాక్షిగ మా అంతరాత్మల ప్రభోదమివ్వంగ యిదే మా ప్రతిన
ఆడపిల్లలపై అరాచాకాల్ని అడ్డుకుంటాం నీపై దాష్టీకం చేసినవాళ్ళని ఊరితీయిస్తాం
విసురజ (New Delhi..03.30 AM..30.12.2012)
No comments:
Post a Comment