ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

నాటి భారతంలో కుంతి నేటి భారతంలో ఇంతి
తప్పులు సేయంగ బిడ్డలకు జన్మనిచ్చే
తన తప్పెరుగని పసికూన పరిహాసపు పాపడవ్వే
తప్పెవరిదైన ఫలితం పొందేది విసిరేయబడ్డ బ్రతుకుదే
అమ్మని చూడని బిడ్డడని పరువుకై త్యజించబడినవాణ్ణి
కావాలనే అమ్మే దూరం చేసుకున్న అనామకుడ్ని అభాగ్యుణ్ణి
చెత్తకుప్పలపైనో ముళ్ళకంపల మాటునో వదిలేస్తే కుక్కలకు ఆహారాన్ని
అనురాగం ఆర్ద్రత నిండిన చేతులే చేరదీస్తే చిగురించిన అదృష్టాన్ని
జననీ నీకు చేతులెత్తి మొక్కుతా ముందుగా తప్పు చేయమాకు
చేసితివి పో పోయి మగపురుషుడ్నినిలదీసిగాని నను కనమాకు
విసురజ

No comments: