కేంజయి రంగు నింగిని కౌగిలించింది
అంబుధి తీరంలో కోమలాంగి నిలిచింది
చేతిలో కంకులతో చేతులలో పైరు సిరులతో
కాటుక కళ్ళతో కొప్పులో ముడిచిన పూలతో
తీరైన మోముతో చేతులకు పచ్చని గాజులతో
చుక్కల జలతారు వన్నెల వల్లెవాటుతో
దాచినా దాగక ఉబికొచ్చే చెలి అందాలు
మదికిటికీకి ఎదగదికి తాళం తీయించిన ఘనులు
ఎదురుచూపులతో మనసు పతంగం ఎగరేసినా సఖా
నీ వలపు గాలులు వీయించి నా ప్రేమను ఎత్తున నిలబెట్టవా
విసురజ
అంబుధి తీరంలో కోమలాంగి నిలిచింది
చేతిలో కంకులతో చేతులలో పైరు సిరులతో
కాటుక కళ్ళతో కొప్పులో ముడిచిన పూలతో
తీరైన మోముతో చేతులకు పచ్చని గాజులతో
చుక్కల జలతారు వన్నెల వల్లెవాటుతో
దాచినా దాగక ఉబికొచ్చే చెలి అందాలు
మదికిటికీకి ఎదగదికి తాళం తీయించిన ఘనులు
ఎదురుచూపులతో మనసు పతంగం ఎగరేసినా సఖా
నీ వలపు గాలులు వీయించి నా ప్రేమను ఎత్తున నిలబెట్టవా
విసురజ
No comments:
Post a Comment