ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

కవిత: ప్రేమ తీరులు
రచన: విసురజ
...........
ఎదలే ముడిపడంగా
తనువులు జతకడితే
తలపులే తెల్లవారంగా
మనువుకై త్వరపడితే
వలపు కామేష్టి యజ్ఞ్యానికి
చూడు చూడు ఫలాలందేనదిగో
అలౌకిక జీవన ఆనందానికి
మకరంద మరంద మాలలివిగో
పశ్చిమమైనా భరతమైన
ప్రేమ బాష్యాలు మారునా
రంగు రూపులు ఏమైనా
ప్రేమించే రీతులు వేరైనా
ప్రేమ పంచే అమ్మ తత్వంలో
మార్పు కనబడునా
తల్లీ పిల్లల మధ్య అవ్యాజానురాగాలలో
లోటుండునా

No comments: