ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

1) దేశ సేవ అంటే నా ఉద్దేశ్యంలో ఉపన్యాసాలు, మొక్కుబడిగా పనులు చేయడం కాదు, ఎవరు విధిని వారు సక్రమంగా నిర్వర్తించడమే, అదే నిజమైన సిసలైన దేశసేవ

2) ఎన్నో కొమ్మల రెమ్మలతో ఎంత పెద్దదిగా వృద్దిచెంది విస్తరిల్లినా అసలుకి మతమనేది ప్రపంచంలో ఒక్కటే..అదే సర్వ సమానత్వం ప్రభోదించే మానవత్వం.

3) ప్రతి మనిషీ చిరకాలం జీవించాలని తలుస్తాడు కానీ వయసు ఎదగడం మటుకు సహించలేడు. జీవితం కరగిపోయే మంచు. కరగకముందే ఉన్నదాంట్లో అందరికి పంచు. మనసుకి ఆహ్లాదం కలుగుతుంది.

No comments: