ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 2 March 2013

"ముగ్ధమోహనం" (11th chapter)
.......................................................
మౌనాన్ని యుద్ధం గా ప్రకటించింది ముగ్ధ. ఇంటికి వచ్చేవరకూ ఏమీ మాట్లాడలేదు. తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళింది. ఓరకంట కార్తికేయను గమనిస్తూనే వుంది. సీరియస్ గా సోఫాలో కూచోని ఏదో ఆలోచిస్తున్నాడు. "బహుశా తనను పంపించడం కోసమే కాబోలు" కోపంగా అనుకుంది. కార్తికేయ ఇచ్చిన చీర విప్పి గిరాటు వేసి తన చీర కట్టుకుంది. దుఖం తన్నుకొస్తుంది. ఇంత జరిగినా తనతో ఒక్క మాటైనా మాట్లాడాడా? విసురుగా బయటకు రాబోయి ఆగింది. మూలకు గిరాటు వేసిన ఆ చీరను గుండెలకు హత్తుకుంది. కొన్నిగంటల పాటు తనను అంటిపెట్టుకున్న చీర. నిజం చెప్పాలంటే కార్తికేయే తనను చుట్టేసిన అనుభూతిని మిగిల్చిన చీర. ఆ చీరను భద్రంగా ఓ కవర్ లో పెట్టింది. బయటకు నడిచింది. కేవలం కొన్ని గంటలే గడిపిన గది. అయినా తన మదిని ఈ గదిలో వదిలి వెళ్తోన్న ఈ ఇది ఏమిటో? ఈ ఇంటితో తనకిక ఏ సంబంధం వుండదా.
************ ****************** *********************
కార్తికేయ ఆలోచిస్తున్నాడు. కారులో వుండగా వచ్చిన ఫోన్ కాల్. సి బి ఐ నుంచి వచ్చిన ఫోన్ ...అర్జెంటు గా కలవాలన్న మెసేజ్ . "వెళ్దామా" ముక్తసరిగా అడిగింది ముగ్ధ. అలాగే అన్నట్టు లేచాడు.
"పొద్దున్న తెచ్చిన పాలు కాచి, చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టాను. ఫిల్టర్ పెట్టాను...నన్ను పంపించి వచ్చాక కాఫీ చేసుకొని తాగండి" కోపం..ఉక్రోషం కలిసిన గొంతుతో ముగ్ధ. కార్తికేయ ఏం మాట్లాడలేదు. వెళ్దామా అన్నట్టు చూసాడు. మీరు తెచ్చిన చీరలు ఆ గదిలోనే వున్నాయి.....కోపాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ అంది. ఇక అక్కడ వుండలేనట్టు బయటకు నడిచింది.
కారులో మౌనంగా కూచుంది.ముగ్ధ ".చా..ఈ మగాళ్ళంతా ఇంతే...కనీసం కాఫీ తాగి వెళ్దాం" అనవచ్చుగా.
************** ******************** ***********************
హాస్పిటల్...
రూం నంబర్ పదమూడులో ముగ్ధ ఫ్రెండ్ ...
"సారీ ముగ్ధ....ఎ టి ఏం లో మనీ డ్రా చేసి వస్తుంటే ఎదురుగా వస్తోన్న కారును చూసుకోలేదు.
కార్తికేయ గారు నువ్వు తన దగ్గరే ఉన్నవని తెలిపేక రిలాక్సయ్యాను .
నీకో విషయం తెలుసా...నేను నీ ఫ్రెండ్ ని అని తెలిసాక ఇక్కడ డాక్టర్స్ తో మాట్లాడి నన్ను స్పెషల్ వార్డ్ లో షిఫ్ట్ కార్తికేయ గారు చేయించారు. వద్దన్నా వినకుండా బిల్ పే చేసారు" అని కార్తికేయ వైపు తిరిగి థాంక్స్ అండీ....అంది. ఒక్క క్షణం ముగ్ధ కార్తికేయ వైపు చూసింది. తన ఫ్రెండ్ అని తెలిసి "ఇంత సాయం చేసాడా"?అయినా తానేమీ చేయనట్టు వున్నాడు..
"ఏయ్..ముగ్దా ఏమిటే...నాకింత యాక్సిడెంట్ అయినా పలకరించకుండా వున్నావు"....
నీ తీరు చూస్తె "యాక్సిడెంట్ బాగా అయింది" అన్నట్టుంది, నవ్వుతూ అంది ముగ్ధ ఫ్రెండ్ హేమంత.
"అదేమీ లేదండీ...మీకు యాక్సిడెంట్ అయిన షాక్ లోనే వుందింకా ..అన్నట్టు ఇంకాసేపట్లో మిమ్మల్ని డిశ్చార్జి చేస్తారు" చెప్పాడు కార్తికేయ.
"హాస్పిటల్ లో వుండి బోర్ కొట్టింది. మా ముగ్ధకు తాజ్ మహల్ చూపించాలి. మరో రెండు రోజుల్లో వెళ్లిపోవాలి" ముగ్ధ స్నేహితురాలైన హేమంత అంది.
"మీకు అభ్యంతరం లేకపొతే ఈ ముగ్ధ గారు రొండు రోజులు మా ఇంట్లో గెస్ట్ గా వుంటారు. రేపు మీరు తాజ్ మహల్ చూసే ఏర్పాటు నేను చేస్తాను".
"కదిలిన కాలం పూలవానాలతో కలిసొచ్చి వింజామర వీస్తూ చుట్టేసినట్టు...
గుండె గొంతుకలోని స్వరం వరమిస్తూ...దీవించినట్టు...
"కార్తికేయకు పక్కగా రెండు అడుగుల దూరంలో వున్నా ముగ్ధ రెండు అడుగులను
వేసి మూడో అడుగు ఇదే అన్నట్టు అతని పక్కగా నిలబడి అతని చేతిని పట్టుకుంది...
అ...ప్రయత్నం గా.ఒక్క క్షణం ఏడుస్తూ నవ్వాలనిపించింది.
ఆనందభాష్పమా...భావోద్వేగానికి ఇది నువ్వు చెప్పిన భాష్యమా ..
హేమంత అది గమనించింది. చిన్న నవ్వు...ఈ ప్రపంచం లో "నేను...తమ్ముడు అంతే" అనే ముగ్ధ ...ఎప్పుడూ చలించని ముగ్ధ ...ఇప్పుడిలా...
"మా ముగ్ధకు ఓకే అయితే నాకు ఓకే " అంది ముగ్ధ వైపు చూసి.
కార్తికేయ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది.
"తను రాయని రాతను...ముగ్ధ నుదుట కార్తికేయ అభిలిఖించిన ఆర్తి గీత
భగవద్గీతలో అన్నట్టు లలాట లిఖితం .విధాత సంకల్పం "
************* ****************** ****************
ముగ్ధ ,కార్తికేయ బయల్దేరారు. హేమంత డిశ్చార్జి అయి ఇంటికి వెళ్ళింది. కార్తికేయ డ్రైవ్ చేస్తున్నాడు.మౌనంగా వున్నా ఆ మౌనంలో ఎన్నో కబుర్లు ఆమె గొంతులో సేదతీరుతున్నాయి.
ఇంటికి వచ్చాక కార్తికేయ ముగ్ధను అడిగాడు."కాఫీ చేయగలరా ?
ఆ మాత్రానికే చెంగున లేడి పిల్లలా కిచెన్ లోకి పరుగెత్తింది.
అయిదు నిమిషాల్లో పొగలు కక్కే కాఫీతో వచ్చింది.
కాఫీ తాగేక చెప్పాడు కార్తికేయ "నేను ఆఫీసు వరకు వెళ్లి వస్తాను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. లంచ్ ఆర్డర్ చేస్తాను. ఇంటికే వస్తుంది "
"పర్లేదు మీరు వచ్చాకే చేస్తాను. ఆకలి లేదు..ఫ్రిజ్ లో వున్నా పళ్ళు తింటాను" చెప్పింది ముగ్ధ.
*********** ********************* ***********************
సి బి ఐ కార్యాలయం .
రిసెప్షన్ దగ్గరికి రాగానే సులోచన ఎదురొచ్చింది, సి.బి.ఐ చీఫ్ కు సెక్రటరీ, ఆమె. అయిదడుగుల ఎనిమిది అంగుళాల పొడవు. పెదవులపై చెదరని చిరునవ్వు...
"గుడ్ మార్నింగ్ సర్.. మీ కోసం చీఫ్ వెయిట్ చేస్తున్నారు...ప్లీజ్" అంటూ దారి చూపించింది.
"మీ పెళ్లి ప్రయత్నం ఎంత వరకు వచ్చింది? అడిగాడు కార్తికేయ.
"థాంక్ యు సర్...నేను గుర్తు వున్నందుకు...నా హైట్ నా పాలిట విలన్ అయింది ...పెళ్లి చూపుల్లో మగవాళ్ళ ఈగోను సంతృప్తి పరచడానికి వంగి నడవాల్సి వస్తుంది. ఓ నవలలో చదివిన గుర్తు .దేవుడా...పొడవైన అమ్మాయిలకు..ఇంకా పొడవైన అబ్బాయిలను సృష్టించు..లేదా అబ్బాయిల హృదయాల్లో విశాలమైన మనసును సృష్టించు" ఒక కన్నీటి చుక్కను కొనగోటితో తుడుచుకొని చెప్పింది.
ఈ లోగా చీఫ్ క్యాబిన్ వచ్చింది. డోర్ తీసి కార్తికేయ లోపలి వెళ్ళగానే వెనక్కి వచ్చింది.
చీఫ్ క్యాబిన్ బయటి రెడ్ లైట్ వెలుగుతుంది.ఎవరూ లోపలి రావద్దని అర్ధంగా.
********** *************** **************
సి.బి.ఐ. కార్యాలయం ఎదురుగా వున్నా బిల్డింగ్ లో మూడో అంతస్తులో గ్లాస్ విండోస్ ఓపెన్ చేసి...బైనాక్యులర్స్ ని అడ్జస్ట్ చేసింది మహన. సరిగ్గా సి.బి.ఐ.చీఫ్ క్యాబిన్ కు ఎదురుగా వుంది ఆ ఫ్లాట్ లోని బెడ్ రూం. బైనాక్యులర్స్ కి అతి శక్తివంతమైన గన్ అమర్చబడివుంది. అది ఏ క్షణమైనా నిప్పులు గక్కడానికి సిద్ధంగా వుంది.
********* ************** ****************
కార్తికేయ గది సర్దుతున్న ముగ్ధకు ఏదో అనుమానం వచ్చింది, ఎవరో ఆ ఇంట్లోకి ప్రవేశించినట్టు...
(వాట్ నెక్స్ట్ ..రేపటి సంచికలో )

No comments: