ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 12 March 2013

"ముగ్ధమోహనం" (17th chapter)
(11-02-2013)
........
డేవిడ్ ఓ సారి గదిని నిశితం గా పరిశీలించాడు. అతనికి ఆ లాడ్జ్ లో ప్రతీ గది కొట్టిన పిండి. చిన్నప్పటి నుంచి ఆవారాగా తిరిగాడు...చెడు స్నేహాలు...ఆరేళ్ళ వయసులో కొందరు కొజ్జాలు డేవిడ్ ని ఎత్తుకెళ్ళారు.ఎ లాగోలా వాళ్ళ నుంచి తప్పించుకుని హోటల్స్ లో పని చేసాడు. ఆ తర్వాత ఈ లాడ్జ్ లో చేరాడు.
హిజ్రాలతో తిరగడం,మగ వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం చేస్తాడు. మంచం మీద చొక్కాలు వున్నాయి. సిగరెట్ ప్యాకెట్...వుంది. అతని దృష్టి సూట్ కేసు మీద పడింది.
అతను సూట్ కేసు లు వెతికేది డబ్బు కోసం కాదు. పోర్న్ మేగజైన్ లు ఉంటాయేమోనని.
సూట్ కేసు ఓపెన్ చేసి ఒక్క క్షణం షాకయ్యాడు. బట్టల అడుగున కనిపించింది రివాల్వర్....అంత కన్నా మరో షాక్ ...అందులో ఆడవాళ్ళ దుస్తులు వుండడం.
అంటే లాడ్జ్ కు ఇద్దరు వచ్చారా? ఒక ఆడ, ఒక మగ? తనకు తెలియకుండా మరో వ్యక్తి వచ్చే అవకాశం లేదు. భయం...బాత్ రూం లో నుంచి నీళ్ళ ధార...మెల్లిగా శబ్దం చేయకుండా బాత్ రూం వైపు నడిచాడు.
*********************************************************** మోహన్ షర్టు విప్పింది. ఆమె ఒంటి మీద అండర్ గార్మెంట్స్ తప్ప మరేమీ లేవు. ఎదురుగా చిన్న అద్దం.
మసక బారిన అద్దం. ఆ అద్దంలో చూసుకుంది. మోహనది చాలా అందమైన పర్సనాల్టీ...
ఒక్కో అవయవాన్ని పొందికగా కూర్చినట్టు వుంటుంది. ఈ అందాన్ని ఎందరి మీదో ఆయుధంగా ప్రయోగించింది. ఇంత వరకు ఆమె శరీరాన్ని టచ్ చేసే దైర్యం ఎవరూ చేయలేదు.
రెండు సంవత్సరాల క్రిందట ఓ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేసింది. వాళ్లకు అత్యాధునిక ఆయుధాలు వాళ్ళున్న అడివి ప్రాంతానికి వెళ్ళి సమకూర్చింది. ఆ సంస్థలోని ఓ కరుడుగట్టిన ఉగ్రవాది కన్ను మోహన అందం మీద పడింది. ఆ రాత్రి మోహన టెంట్ లో పడుకుంది. ఆమె తల కింద రివాల్వర్ వుంది. మోహన నైటీలో వుంది. గాలికి నైటీ చెదిరి ఆమె కాళ్ళు ఆ వెన్నెలతో పోటీ పడి మెరుస్తున్నాయి. మోహన ప్రతీ క్షణం ఎలర్ట్ గా వుంటుంది. చిన్న అలికిడి అయినా మెలుకువ వస్తుంది. ఉగ్రవాది టెంట్ లోకి రాగానే కళ్ళు తెరిచింది. ఆమె కుడి చేయి దిండు కింద వున్న రివాల్వర్ని టచ్ చేసింది.
"కూల్ కూల్ ....కోమాలో వున్న వాడిని కూడా నిద్రలేపే అందం నీది. నాతొ చేతులు..సారీ ...నీ శరీరం కలిపావనుకో...ఈ సంస్థ నీ చేతుల్లో పెడతా...ఈ సంస్థకు నువ్వే చీఫ్. మోహనను చూస్తూ అన్నాడు...అతని చూపులు మోహన తల మీదుగా ,మెడ దాటి కిందికి వస్తున్నాయి...వ... చ్చే...సా...యి..క్షణం లో వెయ్యో వంతు...మోహన చేతిలో వున్నా సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ లోని బులెట్ అతని కనుబొమ్మల మధ్య నుండి దూసుకు వెళ్ళింది. ఉగ్రవాది వెనక్కి పడిపోయాడు. అతని ప్రాణం ఆ అడవిలో ఎగిరిపోయింది.
*************** ******************* **********************
ఉగ్రవాదులంతా సమావేశమయ్యారు. మోహనలో ఏ మాత్రం బెరుకు,భయం లేవు.
చనిపోయిన ఉగ్రవాది చివరగా మోహనతో మాట్లాడిన మాటలు ప్లే చేసింది.
"ఉగ్రవాద సంస్థ ఎవడి స్వంత ప్రాపర్టీ కాదు. మీ చీఫ్ స్థానంలో నేను వాడి పక్కలో పడుకుంటే నన్ను చీఫ్ ని చేస్తానన్నాడు. అది మొదటి తప్పు. నేను ఆయుధాలు అమ్మడానికి వచ్చాను...నా శరీరాన్ని బేరం పెట్టడానికి కాదు. నేను కూడా ఆ ఆయుధాలలో ఒక ఆయుధాన్ని. బుల్లెట్ అవసరం లేని వెపన్ ని. నేను ఖర్చు చేసిన బుల్లెట్ ఖర్చు నా ఎకౌంటు లో రాసుకోండి."
********** ****** ******************************* ******************
అదీ మోహన క్యారెక్టర్.
డేవిడ్ బాత్ రూం డోర్ దగ్గరికి వచ్చాడు. బాత్ రూం డోర్ కి చిన్న కన్నం వుంది. ఆ కన్నం దగ్గరికి వెళ్లి ఎడమ కన్ను ఆ కన్నం దగ్గర పెట్టి...
తలుపు విసురుగా తెలుసుకుంది.ఎదురుగా మోహన...ఆమె చేతిలో పదునైన కత్తి.
సరిగ్గా పది నిమిషాల తర్వాత ఆ లాడ్జ్ లో నుంచి బయటకు వచ్చింది. మోహన గదిలో డేవిడ్ శవం...
భయానకంగా...అతని కళ్ళు పీరెకివేయబడి...తన అర్ధనగ్న శరీరాన్ని ఒక కన్నుతో చూసినందుకు, మోహన వేసిన శిక్ష.
************ ******************** ************************
ఢిల్లీ ఎయిర్ పోర్ట్
ఎఫ్.బి.ఐ.ఏజెంట్ 'రాబర్ట్' ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చాడు. క్యాబ్ ని పిలిచి అడ్రెస్ చెప్పాడు...ఏషియన్ లాడ్జ్. అక్కడ మోహన ఉందన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తున్నాడు. రాబర్ట్ ఏషియన్ లాడ్జ్ కు వెళ్లేసరికి అక్కడ పోలీసులు వున్నారు. డేవిడ్ శవం వుంది.

No comments: