ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 30 March 2013

1) ప్రతి మనిషికి జీవితపు వైకుంఠపాళిలో గెలుపు నిచ్చెన ఎక్కడానికి ఉత్సాహపరచే మనసు మరియు ఉత్సుకత అనే ముందుకు నెట్టే శక్తి అవసరం ఎంతైనా వుంటుంది. ఒకోసారి పొరపాటు జరిగి క్రిందకు జారిన, తిరిగి నిలదొక్కుకోవడానికి నిబ్బరం, నెమ్మదైన మనసు, ఉత్సాహం వుండాలి.
2) మనిషి బుర్ర నిండా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైనప్పుడు కూడా స్పష్టతతో ఆలోచించే మనసుండాలి. అలాగే తెలివితేటలతో మనిషికి ఏ పని ఎలా చేయాలో తెలుస్తుంది, కానీ సామర్ధ్యానికే ఆ పనిని ఎలా జయంగా పూర్తి చేయాలో తెలుస్తుంది.

No comments: