ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

కవిత: నీ తలపే
............
కడలి కెరటాలు ఎగిసిపడ్తుంటే నీ తలపే
సుడిగాలి రివ్వురివ్వునా వీస్తుంటే నీ తలపే
మేఘాలు చల్లంగానల్లంగా నింగిని కమ్ముతుంటే నీ తలపే
పుష్పాలు సుగంధసౌరభాలు వనంలో నింపుతుంటే నీ తలపే

పొదరిల్లు మాటున పకపకలు వింటే నీ తలపే
పరదాల చాటున గుసగుసలు వింటే నీ తలపే
స్నేహితుల రుసరుసలు వింటే నీ తలపే
కొంటెకారు తహతహలు వింటే నీ తలపే
........
విసురజ

No comments: