ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

కవిత: బాధ బాధే
...............
ఎదురుంగ ఉండి మాటాడకున్న బాధే
ఎదుటపడి ఎదలోనిమాట దాచినా బాధే
ఎదుట నిలబడినా ఎద స్పందించకపోతే బాధే
ఎదుటేవుండీనా ఎటోచూస్తుంటే అదీ మరీ బాధే

పరుగున వచ్చినా నీవు పలకరించకపోతే బాధే
పదుగురు మెచ్చినా నీవు ఆదరించకపోతే బాధే
ప్రమాదమని తెల్సినా నిను చేరుకోలేకపోతే బాధే
ప్రాకారమని తెల్సినా నిను అందుకోలేకపోతే బాధే
.......
విసురజ

No comments: