ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

కవిత: ఆక్రోశం
.............
పొద్దొన్నేవచ్చే పాలవాడినడుగు
(పాల) సాంద్రత చూపి చెప్పే
వెచ్చాలమ్మే వీధిచివరి శ్రేష్టినడుగు
పద్దు చూపి చెప్పే
కూరలమ్మే కోమలి కాంతమ్మనడుగు
బుట్ట చూపి చెప్పే
కండలమ్మే కుదేలైన కూలోడ్నడుగు
చెమట చూపి చెప్పే
ధరలో ధరలు ధగ ధగ ఎలా మెరుస్తున్నాయో
భువిలో భాగ్యాలు భగ భగ ఎలా మండుతున్నాయో
క్లబ్బుల్లో రేసుల్లో రాసుల్లో
తులతూగువాళ్ళకేమి తెలుసు ..ఆకలి తంట
మండువాల్లో మాలుల్లో మహలుల్లో
మసిలేవాళ్ళకేమి తెలుసు..కడుపు మంట
కష్టించేవానికి పనిలేదు కడుపుకింత తిండిలేదు
మనసిష్టం సరిలేదు మనగలగడం సులువుకాదు
ప్రశ్నలడిగితే పేరసైట్
తీవ్రంగా చూస్తే తీవ్రవాది...ఎటుపోతుందీ లోకం
నిలదీస్తే నక్శలైట్
అర్ధాలడిగితే అతివాది...ఎప్పుడుమారుతుంది భారతం.
...
విసురజ

No comments: