ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

కవిత: మారుతున్న కాలమా
......................
చిన్నప్పటి దుంపల బద్లు లేవు
చిన్ననాటి టైరు త్రిప్పాటలు లేవు
ఒకప్పటి సాయంత్రాల సరదా సందడి లేదు
ముందునాటి చీక్కు తినే జీడ్లు లేవు
మారుతున్న కాలమా ఇది నీ నైజమా

నాటి రెండెడ్ల గూడు బళ్ళు లేవు
నాటి సంతలు జాతరలు లేవు
నాటి చావడి మీటింగ్లు పలకరింపులు లేవు
నాటి అప్యాయతలు ఆదరణలు లేవు
మారుతున్న కాలమా ఇది నీ నైజమా

నాడు కరెంట్ కోతలు లేవు
నాడు నీటి కొట్లాటలు లేవు
నాడు భూతాప భారాలు లేవు
నాడు భూదందా భూకబ్జాలు లేవు
మారుతున్న కాలమా ఇది నీ నైజమా

నాటి తోలుబొమ్మలాటలు కనుమరుగయ్యే
నాటి వీధి సినిమాలు మృగ్యమయ్యే
నాటి గ్రంధాలయ పఠనాలు మాయమయ్యే
నాటి నాలుగుకూడళ్ళలో వేసే వీధి నాటకాలు కానవాయే
మారుతున్న కాలమా ఇది నీ నైజమా
............
విసురజ

No comments: