ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

కవిత: నారీ మణి
(అంతర్జాతీయ మహిళా దినోత్సవం..2013..సందర్భముగా)
....................
జీవానికి ప్రాణం పోస్తావు
జీవితానికి అర్ధం నేర్పుతావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

భవితవై నిలుస్తావు
బ్రతుకుకు బాష్యమైతావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

కులుకులకు నెలవవుతావు
కంజాతాలకు సౌకులద్దుతావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

అందాలకు అర్దమవుతావు
అందీ అందని అందమవుతావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

ప్రేమదీపమై నిలుస్తావు
ప్రేమతీరానికి గట్టువవుతావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

ఆలివై అలరిస్తావు
అలంబనగా నిలుస్తావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

ప్రగతికి మార్గమేస్తావు
పద్దతికి ముచ్చటపడతావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

కవితకి వస్తువవుతావు
కామంధుల కాముకతకు బలవుతావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

పరువుకై ప్రాణాలిచ్చేవు
పరువుకై ప్రాణాలుతీస్తావు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా

నీవు లేక జగతి లేదు జనహితం లేదు
నీవు లేక సుగతి లేదు సుచరితం లేదు
తల్లి నారీ మణి శిరోమణి నీకు సాటి ఎవరమ్మా
.....

No comments: