ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 30 March 2013

కవిత: నేర్వండి ..నడవండి
........................
మతమో మత్తుమందు
దుర్మతి మోకరిల్లే దాని ముందు

కులం కులమంటూ జపించేరు
కులపోళ్ళకై చొంగలు కార్చేరు అర్రులు చాచేరు

కష్టకాలమొస్తే ఏ కులపోడు నీ తోడు నిలిచేరా
పిలిచి కడుపుకింత ఎవరు అన్నం పెట్టేనురా

మానవత్వం వున్న మనిషి తప్ప
వానికి కులాలతో పనిలేదురా మంచి తప్ప

జాతుల తేడాలొద్దు అభిజాత్యపు ఘీంకారాలొద్దు
మాటల తూటాలొద్దు మమతల వాటాలొద్దు

కష్టాలు నష్టాలు బాధలు క్యాస్టులు జాతుల తేడాలు చూపవే
సినిమాక్యూలల్లో ఇస్కూలల్లో పార్కుల్లో మరి తేడాలు చూపమే

ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు మరెందుకీ ఉత్తుత్తి ప్రమాణాలు
అందరు నా సోదర సోదరీమణులేనంటూ అందరు నాకు సమానులేనంటూ

నేటికైన నేర్వండి మనసైన మనిషిగా ఎదగండి
జాతులలో కులంలో లేదండి ఘనత గుణంలో వుందండి

నిగర్విగా నిలబడు ఒంటరిగానైన మొదలిడు నిఖార్సైన రీతిలో నడువుడు
ప్రాంతాల కుల జాతుల విషయాలు విడువుడు సకల జనహితంకై పోరాడు
......................
విసురజ

No comments: