ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---61)
(27-03-2013)
...........................................................
(ముగ్ధమోహనం వీక్షకులకు, పేస్ బుక్ ఆత్మీయులకు, నేను సృష్టించిన పాత్రలను ఆదరించి, అక్కున చేర్చుకున్న వీక్షక హృదయానికి, హోలీ పర్వదిన హృదయ పూర్వక శుభాకాంక్షలు --విసురజ)
................................................
మోహన కనిపించక పోవడంతో ఒక్క క్షణం భయపడిపోయాడు. అతని చేతిలో అన్నం ప్లేట్ వుంది. తన వెనక చిన్న అలికిడి. తల తిప్పి చూస్తే మోహన.
"మీరు అన్నం తినలేదు కదూ..." అడిగాడు కార్తికేయ.
"తినలేక పోయాను" గోరింట చేతులు చూపిస్తూ చెప్పింది మోహన.
"కూచోండి ..నేను తినిపిస్తాను"
మోహన కూచుంది. కార్తికేయ తినిపిస్తున్నాడు. అతని సన్నటి చేతివ్రేళ్ళ మధ్య వున్నందకు అన్నం మురిసిపోతుందేమో. అలా ఆలోచిస్తూ మోహన తన చిన్ని నోరుని తెరిచింది. అనుకోకుండా ఆమె కళ్ళలో సన్నటి నీటి చెలమ.
"ఏమైంది..కారం ఎక్కువైందా? కంగారుగా అడిగాడు
"కారం కాదు మమకారం ఎక్కువైంది" అనలేదు పైకి...అనుకుంది మనసులోనే...
"చిన్నప్పుడు అన్నం తిననని మారాం చేస్తే అద్దంలో చందమామను చూపించిన కధే జ్ఞాపకం...వెండి గిన్నెలో అన్నం తిన్న జ్ఞాపకం లేదు...అమ్మ చంకలో ఎక్కి బువ్వ తిన్న గుర్తు లేదు...ఆకలితో పోరాటం...ప్రాణాలు తీసే రాక్షసత్వం...రక్తపాతాల దాహం...ఇదే నా ప్రపంచం...ఆకలేస్తే వైన్ తాగుతాను...దాహమేస్తే విస్కీ తాగుతాను...నిద్ర వస్తే కరెన్సీ మీద పడుకుంటాను...కానీ ఒక్క..ఒక్క ఏడుపు వస్తే మాత్రం..ఏమీ చేయలేను...చివరికి ఏడవాలననిపించినా అహం అడ్డొస్తుంది." కళ్ళల్లో కన్నీటితో, మనసులో ఆలోచిస్తూ యధాలాపంగా పైకి అనేస్తూ నవ్వుకుంది మోహన.
"మోహనా నువ్వు మారవచ్చుగా?
"ఇప్పుడు మారిపోయానుగా..అదే నీ ముగ్ధగా"
"అలా కాదు..." ఎలా చెప్పాలో తోచలేదు.
పొలమారింది మొహనకు.
కార్తికేయ వాటర్ గ్లాస్ ఇచ్చాడు.
*****************
"థాంక్యూ" అంది మోహన
"ఎందుకు?
"చిన్నపుడు అమ్మ చేతి గోరుముద్దలు తినలేదన్న బాధ పోగొట్టినందుకు"
"థాంక్యూ" అన్నాడు కార్తికేయ
"ఎందుకు?
"ఇంకా నీలో సెంటిమెంట్ బ్రతికే వున్నందుకు..దాన్ని బ్రతకనిచ్చినందుకు "
మోహన మాట్లాడలేదు...
*****************
కారికేయ తన గదిలోకి వెళ్ళాడు.
సరిగ్గా అప్పుడే అతని చేతిలోని సెల్ రింగ్ అయింది.
ఆన్ బటన్ ప్రెస్ చేసాడు. అటువైపు నుంచి అపరిచిత గొంతు...మగ గొంతు....
"మిస్టర్ కార్తికేయ...మీకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను...చాలా ముఖ్యమైనది"
"ఏమిటది" ఇంతకూ మీరెవరు?
"శత్రువుకు శత్రువు మిత్రుడు ..."
"అంటే ...
మోహనకు సంబంధించిన సమాచారం...మిలటరీ స్థావరాలకు సంబంధించిన సమాచారం...
"మీకెలా తెలుసు?
"అది మీకు అనవసరం...నాకు ప్రతిఫలం కావాలి"
ఓకే చెప్పండి?
"ఈ రహస్యాలను చెప్పినందుకు మోహనను చంపాలి"
కార్తికేయ మాట్లాడలేదు...
"మౌనం సమాధానం కాదు కార్తికేయ..." అవతలి గొంతు పలికింది.
"మీ సాయం అక్కర్లేదు" కార్తికేయ అన్నాడు.
"మీరు దేశాన్ని కాపాడుకునే అవకాశం మిస్సవుతున్నారు"
"నా దేశాన్ని, మొహనాను ఎలా కాపాడుకోవాలో తెలుసు..మోహనను చట్టానికి మాత్రమె అప్పగిస్తాను...నా గొంతులో ఊపిరి ఉన్నంతవరకు మీరు మోహన నీడను కూడా సమీపించలేరు. అయినా మోహన సివంగి...మీ లాంటి వారు మోహనను ఏమీ చేయలేరు."
"వెరీ గుడ్...ఒక నేరస్తురాలిని పొగుడుతున్నారే?
"ఆమె నేరస్తురాలు అయినా ఆమెలో కొన్ని క్వాలిటీస్ వున్నాయి ..అవి మీకు చెప్పినా అర్ధం కావు"
"ఓకే ఓకే ..నాకు మోహన పతనం కావాలి...అందుకోసమైనా మీకు ఓ రహస్యం చెబుతాను...మిలటరికి సంబంధించిన రహస్యాలు వున్న పెన్ డ్రైవ్ సత్తార్ దగ్గర వుంది..ఆతను తిరుపతిలో వున్నాడు...ఈ రోజు హోలీ సంబరాల్లో జనం వుంటారు...రేపు తిరుపతి వస్తోన్న రాష్ట్రపతిని ..." అవతలి వ్యక్తీ చెప్పడం మొదలుపెట్టాడు.
పదిహేను నిమిషాల తర్వాత ఆ వ్యక్తి ఫోన్ పెట్టేసాక...కార్తికేయ టైం చూసుకున్నాడు. తను తెల్లవారి తిరుపతి వెళ్ళాలి.
మోహనకు సంబంధించిన అత్యంత సున్నిత రహస్యాలు తెలిసిన అజ్ఞాత వ్యక్తి ఎవరా? దీర్ఘంగా ఆలోచిస్తూ అనుకున్నాడు కార్తికేయ.
*******************
మోహన సెల్ ఆఫ్ చేసింది. మిలటరికి సంబంధించిన రహస్యాలు వున్న పెన్ డ్రైవ్ సత్తార్ దగ్గర వున్న విషయం కార్తికేయకు చెప్పాక రిలీఫ్ గా అనిపించింది. మొదటి సారి తను మారిపోతున్ననేమో అనుమానం కలిగింది మోహనకు. విద్యారణ్య నేర్పిన మిమిక్రి ఇందుకు ఉపయోగపడినందుకు నవ్వుకుంది మోహన.
**********************
సత్తార్ ...మనుష్యుల మెదళ్ళు తినే తినే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్...చాలా కాలం పిచ్చాసుపత్రిలో వున్నాడు. అలాంటి సత్తార్ తిరుపతిలో తిష్ట వేసాడు. ఏం జరగబోతోంది....
*************

No comments: