ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

కవిత: నీవు
.........................

Photo: కవిత: నీవు
.........................
మధుమాస వేళలో మదిలో కదలాడిన నీవెవరే...తెలపవా చెలి 
మధురమైన పాటతో ఎదను దోచుకోనిన నీవెవరే...వలపువా చెలి
................
అనురాగ అక్షయతరువు అందించిన తీపిఫలమా నీవు
అభిమాన సుమధనువు సారించిన చిరుసవ్వడా నీవు
అల్లననింగిలో మెరిసి మురిపించిన హరివిల్లువా నీవు
అసమాన రమణీయతే మూర్తిభవించిన బాపుబోమ్మవా నీవు 

వసుధలో సర్వులను ఆహ్లాదపరచిన చల్లగాలివా నీవు
మబ్బులో  దాగివున్న స్వచ్చమైన చినుకువా నీవు
మెరుపులో నిండివున్న అనంతమైన ఊర్జశక్తివా నీవు
వనంలో అంతటావున్న సుందర హరితానివా నీవు

ఉరుములో నెలవున్న భయుత్పాతమైన ఘీంకారమా నీవు
పచ్చనిచేలలో  పైరును చిగురులు తొడిగించిన తొలికరివా నీవు
నగుమోములో సమ్మోహనం చేసే రమ్యమైన చిరునవ్వువా నీవు
పదకవితలలో సొబగులు దిద్దుకొను అజరామరమైన తెలుగువా నీవు

పరువాల పూదోటలో కుసుమించిన సుందర రమణీ సుచరితవా నీవు
ఉదయాల వెలుగులలో శోభించిన కిరణసంజాత కంజాతమా నీవు
సందెల కాంతుల్లో కాంతులీనిన పడమటికెంజాయి రంగవల్లివా నీవు
పున్నమి రాత్రుల్లో ఆమనిని ఆలింగనంచేసే వెండి వెన్నెలవా నీవు
............
మధుమాస వేళలో మదిలో కదలాడిన నీవెవరో..తెలిసేలే చెలి 
మనసైన వలపు పాటతో ఎదను దోచుకోనిన నీవెవరో..వలపువే చెలి 
................
విసురజ 

No comments: