విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---55 )
(21-03-2013)
..........................
అపరిచితులు ఆమెకేసి చూసారు. రివాల్వర్ లో బుల్లెట్స్ లేవన్న విషయం వెంటనే అర్ధమైంది. అంతే వేగంగా స్పందించి కుడికాలిని గాల్లోకి లేపింది.... క్షణం ఆలస్యమైతే ఆ ఇద్దరిలో ఒకడి తల పగిలేదే....కానీ కార్తికేయ మెరుపు వేగం తో ఆ ఇద్దరినీ వెనక్కి లాగాడు. మోహన తనను తానూ బ్యాలెన్స్ చేసుకుంది. కార్తికేయ ఆ యిద్దరిని వెళ్ళమన్నట్టు సైగ చేసాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు.కార్తికేయ సోఫాలో కూచున్నాడు. మోహన వైపు చూసాడు. మోహన ఎదురుగా వున్న కుర్చీలో కూచుంది.
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం...
చాలా విచిత్రమైన పరిస్థితి...తను ఎవరినైతే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడో...ఆ వ్యక్తి రూపం...కళ్ళ ఎదురుగా వుంది...కానీ ఆ వ్యక్తి తను ప్రేమించే మనిషి కాదు.
తను ఎవరినైతే పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడో..ఏ వ్యక్తి కోసం ఇంటర్ పోల్ సైతం అన్వేషిస్తుందో..ఆ వ్యక్తి తన కళ్ళ ఎదురుగా వుంది..కానీ ఆ రూపం ఆ వ్యక్తిది కాదు, నమ్మశక్యంగా లేదు.
"మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీ గా వుంది" నవ్వి అంది మోహన.
ఒక్క క్షణం మోహనకేసి చూసాడు కార్తికేయ...మోహన ఫోటోని చూసాడు...ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూస్తున్నాడు. కానీ మోహన రూపాన్ని కాదు. మోహన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
"చెప్పండి కార్తికేయ...." ఏ మాత్రం జంకు లేకుండా అంది.
"మీరు లొంగిపోవాలి..." అన్నాడు కార్తికేయ.
చిత్రంగా చూసింది....
ముగ్ధను ప్రాణంగా ప్రేమించే కార్తికేయ...ముగ్ధ గురించి అడగకుండా...తనను లొంగిపొమ్మని అడగడం...
"నేను లొంగిపోవడం కావాలా? ముగ్ధ ప్రాణాలతో కావాలా?"
"మీరు లొంగిపోవడమే కావాలి? నా ముగ్ధను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు..."
నవ్వింది మోహన ...."నేను లొంగిపోతే..? నాకు పునరావాసం కలిగిస్తారా? నా తల మీద వున్న కాష్ రివార్డ్ నాకిస్తారా? నన్ను జనజీవన స్రవంతిలో కలిపేస్తారా? ఇప్పటి వరకూ ...మీ ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఇవేగా?
కార్తికేయ మాట్లాడలేదు...
"పూలాన్ దేవి అయినా, నక్సల్స్ అయినా, బందిపోట్లు అయినా ...ఎవరైనా లొంగిపోతే మీ ప్రభుత్వం గుర్తించి ఇచ్చే బంపర్ ఆఫర్ "
చళ్ళున చర్నాకోల తో కొట్టిన ఫీలింగ్ కలిగింది కార్తికేయకు...
మోహన విమర్శిస్తున్నట్టుగా లేదు...వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా వుంది.
"బంపర్ ఆఫర్ .." ఈ పదం అతడిని హంట్ చేస్తోంది.
"నేను మాట్లాడింది తప్పంటారా కార్తికేయ....
"కిడ్నాపర్స్ డిమాండ్ చేస్తే కష్టపడి పట్టుకున్న తీవ్రవాదులను విడుదల చేస్తారు. లొంగిపోతే పునరావాసం..నేను రాజకీయ నీతిశాస్త్రం చదువుకోలేదు...క్రిమినాలజీలో నాకే మాస్టర్ డిగ్రీలు లేవు...భారత్ శిక్షా స్మృతి గురించి...ఎవిడెన్స్ ఆక్ట్ గురించి....మీతో చర్చిదానికి నాకు లా పట్టా లేదు...
కానీ ఈ వ్యవస్థలో, చట్టంలో వున్న లోపాలు తెలిసిన క్రిమినల్ ని...
ఒక సాధారణ దొంగ మీద ప్రయోగించే థర్డ్ డిగ్రీ ..ఒక మాఫియా డాన్ మీద...రాజకీయ నాయకుడి మీద...ఓ బిజినెస్ టైకూన్ మీద ప్రయోగించే బలమైన పోలీస్ వ్యవస్థ మనకు ఉందా?
వుంటే నాలాంటి క్రిమినల్స్ ఎందుకు పుట్టుకు వస్తారు....ఆర్దర్లీ వ్యవస్థ...పోలీసుల మీద పెత్తనం చలాయించే రాజకీయ వ్యవస్థ...ఇదీ మీరు బ్రతుకుతున్న భారతం.., అందుకే ఈ దేశాన్ని రాచరికం వైపు...తీసుకువెళ్తాను...రూలర్ ని అవుతాను...అప్పుడు మీలాంటి మేధావులు ఆకాశంలో వుంటారు "
కార్తికేయ మోహన మాట్లాడే ప్రతీ మాట విన్నాడు శ్రద్ధగా...రావణుడు ప్రతినాయకుడు అయినా ధర్మాధర్మాల పరమార్థం తెలిసినవాడు.
"గుడిలో వుంటే రాయి దేవుడవుతాడు...రోడ్డు పక్కన వుంటే రాయిగానే ఉంటాడు...దేవుడి గుడిలో దేవుడిగా.మెట్టుగా., రోడ్డు పక్కన రాయిగా ...అవి వుండే స్థానాలే వాటి గొప్పతనాన్ని సూచిస్తాయి. మీలాంటి మేథావి నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను మార్చవచ్చు...ఇండియన్ పోలీస్ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ...ఇలా ఎలాగైనా అనుకున్న గమ్యం సాధించవచ్చు...
"అందుకని లొంగిపోయి....బుద్దిగా స్కూల్ కి వెళ్లి చదువుకోమ్మంటారా? రాజకీయ పార్టీ పెట్టి డబ్బులు వెదజల్లి ప్రభుత్వాలను కొనుక్కోమంటారా? అయినా ఇప్పుడు అన్ని దశలు దాటాను..ఏనుగును లొంగదీసుకొవాలని అనుకుంటే...అంకుశమే కావాలి...ఆ అంకుశమే విధ్వంసం ...మీరు నా దారికి అడ్డు రాకపోయి వుంటే ఈ పాటికి ఈ దేశం మోహన దేశంగా మారి వుండేది." మోహన అంది.
"ఈ దేశాన్ని, ఈ దేశం పేరును మార్చడం తలరాతలు రాసే విధాత వాళ్ళ కూడా సాధ్యం కాదు. ఆ బ్రిటిష్ వాళ్ళే తోక ముడిచి మన దేశాన్ని అప్పగించి వెళ్ళిపోయారు".
"నిజమే..కానీ వాళ్ళు అప్పగించిన దేశాన్ని, మనం ఏం సాధించాం? ఎన్ని కొత్త రైలు మార్గాలు వేసాం?
ఎంత అభివృద్ధి సాధించాం? నాయకుల పేర్లతో వీధులు, రాష్ట్రాల పేర్లు కూడా మారుస్తున్నాం...వీధికో విగ్రహం..గాంధీ విగ్రహాలు ఎక్కువున్నయా? రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కువ ఉన్నాయా? ఈ దేశంలో మదర్ థెరిసా విగ్రహాలు ఎన్ని?
మొదటి సారి శత్రువు అయినా మోహన పట్ల ఒక గౌరవ భావం కలుగుతోంది. రావణుడు ప్రత్యర్ధి అయినా రాముడు అతని సుగుణాలు కొనియాడాడు..ట. మోహన విశ్లేషణ నచ్చింది. ఇలాంటి వ్యక్తి దారి తప్పడమే బాధ కలిగిస్తోంది.
"మిస్టర్ కార్తికేయ...మనం మన వాదనలను సమర్ధించుకుంటాం... ఇక్కడ ఎవరు రైట్ అన్నది కాదు...ఎవరి కండీషన్ ఏమిటి?
"అంటే? కార్తికేయ అడిగాడు
"వెరీ సింపుల్ ...నేను సృష్టించే విధ్వంసానికి మీరు అడ్డుపడకూడదు..."
"మీరు అనుకుంటున్నట్టు...మరో గంటలో ఎక్కడా ఏ విధ్వంసం జరగదు....చచ్చే ముందు జర్దార్ తో చెప్పించిన నిజాలు...బాంబులను సముద్ర గర్భంలో కలిపేసాయి. ఇప్పుడు మీకు వున్న ఒకే ఒక ఆప్షన్...లొంగిపోవడం..లేదా..." మోహన వైపు చూస్తూ ఆ మాట అనలేకపోయాడు...మోహన రూపంలో వున్న ముగ్ధను చూసి....
"కానీ మీకు నేను రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను "మోహన అంది.
****************************
(ఆ రెండు ఆప్షన్స్ ఏమిటో గెస్ చేయగలరా? రేపటి సంచికలో చూడండి)

No comments:
Post a Comment