విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---56)
(22-03-2013)
"ఎదురుగా వున్నది మృత్యువు" అని తెలిసి కూడా నిబ్బరంగా మాట్లాడే మోహన వంక చూసాడు "ఏమిటవి " అన్నట్టు....
"ఒకటి...నన్ను విడిచిపెట్టడం...
"నేను అతి ఆత్మవిశ్వాసంతో ఓ పొరపాటు చేసాను..పులి గుహలోకి అడుగు పెట్టాను....అది దుస్సాహసం అని ఇప్పుడు అనిపిస్తోంది. దానికి పెద్ద మూల్యమే చెల్లించుకున్నాను...ఇప్పుడు నేను జీరో నుంచి నా ప్రయత్నాలు మొదలుపెట్టాలి.....మీ నుంచి తప్పించుకుపోవడం దాదాపు అసాధ్యమే...కానీ నన్ను మీరు విడిచిపెట్టక తప్పదు..."
"నా గురించి తెలిసేకా కూడా మోహనా, నేను మిమ్మల్ని విడిచిపెడతాను అనుకోవడం అత్యాశేమో ..." కార్తికేయ అన్నాడు.
"అవును...అందుకే రెండో ఆఫ్షన్ మీకు..."
"నాకా...ఏమిటది "
"న...న్ను...చం...ప....డం "
ఒక్క సారిగా కార్తికేయ ఒళ్ళు జలదరించింది....
"మృత్యువు నీ ఎదురుగా నిలబడ్డప్పుడు మృత్యువుతో కరచాలనం చేసే నీ ధైర్యాన్ని చూసి అబ్బుర పడుతున్నాను....నీకు నువ్వుగా "మృత్యువును ఆహ్వానిస్తూ...చిరునవ్వుతో నిలబడిన నిన్ను చూసి...గర్వ పడుతున్నాను...కానీ నువ్వు చూపే ఈ తెగువ....ఓ అసుర కార్యం కోసమని తెలిసి..నిన్ను క్షమించ లేకపోతున్నాను. "
"కార్తికేయ గారూ...శత్రువు బలాన్ని తెలిసి కూడా తెగించి బరిలోకి దిగి మీ చేతిలో ఓడి చచ్చిపోయానన్న ఫీలింగ్ బ్రతికి ఉండగానే నాకు కలుగ కూడదనుకుంటే...నా మరణాన్ని నా ఇష్ట ప్రకారమే పొందానన్న ఫీలింగ్ నాకు కలగాలి."
లా...జి...క్....
యుద్ధతంత్రంలో కనిపించని మెరుపు వేగం తాలూకు మంత్రాంగం...?
కొనసాగించింది మోహన...
"కానీ కార్తికేయా...మీరు నన్ను చంపలేరు...యుద్ధంలో స్త్రీని చంపకూదదన్న నియమం ఉందిట...అయినా అలాంటి సానుభూతి మినహాయింపులు నా మరణానికి వర్తించకూడదు.
మీకు బందీగా దొరికాను...ఎలాంటి ప్రాసిక్యూషన్ లేకుండా చంపే పవర్ మీకు రాష్ట్రపతి ద్వారా సంక్రమించింది అన్న విషయం నాకు తెలుసు....అయినా నా తల మీద వున్నా లక్షలాది డాలర్స్ రివార్డ్ నన్ను చంపడానికి మీకు "లైసెన్స్ టు కిల్ " పర్మిషన్ ఇచ్చినట్టే...అయినా...మీరు చంపలేరు..."
మోహన ఆగి ఒక్క క్షణం..."మీకు ఇష్టమైన వేడి వేడి ఫిల్టర్ కాఫీ తీసుకురానా" అని ఆగి, మీకు ఒక విషయం తెలుసా కార్తికేయా..ముగ్ధ ఇష్టాలు తెలుసుకోవడానికి చాలా కష్ట పడ్డాను...మీకు ఇష్టమైనవి ముగ్ధ ఎలా తయారు చేస్తుందో నేర్చుకోవడానికి...మొదటి సారి ఆరు గంటలు కిచెన్ లో వున్నాను...ముగ్ధలా మిమ్మల్ని నమ్మించడానికి మీకు నిజంగా దగ్గర అయ్యానేమో అనిపించింది. ముగ్ధది మంచి సెలక్షన్...మీరు నన్ను చంపుతారో...జైలులో పెడతారో...జీవిత ప్రస్థాన సీరియల్ లో అప్పటి వరకూ చిన్న కమర్షియల్ బ్రేక్ యిద్దామా...మీతో కలిసి ముగ్ధగా కాఫీ తాగాలని వుంది..బయపడకండి, పారిపోను..
చిన్నప్పుడు నాకు తెలియకుండా ప్రేమించిన మా అమ్మ మీదొట్టు..." అని కిచెన్ వైపు వెళ్ళింది.
కార్తికేయ మనసు భారమైంది.....నిన్నటి వరకూ ఒక కరుడుగట్టిన అంతర్జాతీయ నేరస్తురాలిని వెతుకుతూ నేను...ఈ రోజు తన కళ్ళ ముందే ఒక మామూలు ఆడపిల్లలా కాఫీ కలపడానికి కిచెన్ లోకి వెళ్ళిన మోహన....ఇంటర్ పోల్ ని ముప్పతిప్పలు పెట్టిన మోహన...మైండ్ గేమ్ తో ఎఫ్ బి ఐ ని మూడు చెరువుల నీళ్ళు తాగించిన మోహన...కేవలం కొన్ని వందల గ్రాముల బరువు మాత్రమే వుండే మెదడుతో...ఈ విశ్వాన్ని విధ్వంసం వైపు నడిపిస్తుంటే...?
మోహన వెళ్ళిన కిచెన్ వైపు చూసాడు....ఫిల్టర్ పెట్టినట్టుంది. పాలు మరిగిస్తోంది. ఒక డ్రామా కోసం పాత్రలో జీవించడం కోసం శ్రమ పడి నేర్చుకున్న విషయాలు...కిచెన్ లో నుంచి తన బెడ్ రూంలోకి వెళ్ళింది. డోర్స్ వేసుకుంది. అయిదు నిమిషాల తర్వాత చీర కట్టుకుని వచ్చింది. అచ్చు ముగ్దే చీర కట్టుకున్నట్టే...మళ్ళీ కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకుని వచ్చింది...రెండు కప్పులతో...
ఓ కప్పు కార్తికేయకు ఇచ్చింది...మరో కప్పు తను తీసుకుంది. కార్తికేయ కాఫీ తాగబోతూ ఆగి మోహన వైపు చూసాడు.
"కాఫీలో విషం ఏమైనా కలిపానని అనుమానమా?" అని అతని చేతిలోని కాఫీ కప్పు తను తీసుకుంది.
కార్తికేయ కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
నేను ముగ్ధ రూపంలో వున్నాను...ముగ్ధ ప్రేమని కూడా పంచుతాను...విషం ఇచ్చి చంపను...ముగ్ధ అలా చేయదుగా...
ఆ ఒక్క మాటకు పొల మారింది...కన్నీటి పొర కంటి పొరకు అడ్డం పడింది.
"మీ ముగ్ధ తలుచుకుంటున్నట్టు వుంది " అంది
కాఫీ ని సిప్ చేస్తూ.
***********************
"ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం...మీరు నన్ను వదిలి వేయడం లేదా చంపడం దగ్గర ఆగిపోయాం...నన్నేటూ వదిలి వేయరు...పోనీ చంపగలరా? మీ ముగ్ధ రూపంలో వున్నా నన్ను...ఒక వేళ చంపితే...అని ఆగి...ముగ్ధను మోహనే అనుకుని ఇంటర్ పోల్ వెంటాడి చంపుతుంది...ఎందుకంటే....ముగ్ధ నా రూపంలో ...అంటే మోహన రూపంలో వుంది."
ఒక నిశ్శబ్ద విస్పోటనం...ఒక భయంకర స్వప్నం..ఒక భయానక దృశ్యం....ఒక్క సారి కళ్ళ ముందు...కదలాడిన అల్లకల్లోల పెనుతుపాన్...
ముగ్ధ రూపంలో మోహన...
మోహన రూపంలో ముగ్ధ...
తను ఎవరిని చంపాలి ?
తను ఏ రూపాన్ని చంపాలి ??

No comments:
Post a Comment