ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---62 ) (28-03-2013)
తిరుపతి...
ప్రపంచమంతా భక్తి పారవశ్యం లో మునిగే పవిత్ర పుణ్యక్షేత్రం.కోట్లాది భక్తుల విశ్వాసం.గోవింద నామస్మరణం తో...మార్మోగే ఆధ్యాత్మిక క్షేత్రం. దేశ,విదేశాల నుంచి వచ్చే భక్తుల తో నిత్యం విలసిల్లే శ్రీనివాసుడు కొలువైన చోటు...
ఎక్కడ చూసినా భక్తుల తాకిడి....ఏడుకొండలవాడా వేంకటేశ్వరా... వడ్డీకాసులవాడా...గోవిందా గోవిందా...అంటూ భక్తులు పరవశించిపోతున్నారు.పట్టణమంతా పూర్తి బందోబస్తు లో వుంది. ఆ రోజు భారత రాష్ట్రపతి స్వామి వారిని దర్శించుకోవడాని వస్తున్నాడు.రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి సియం ఇతర మంత్రులూ వస్తున్నారు.గవర్నర్ వస్తున్నారు...నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యం లో ఎక్కడికక్కడ నాకాబందీ జరుగుతుంది.
**************************
తిరుపతిలో చిన్న హోటల్....ఇరుకైన గది...శబ్దం చేసే సీలింగ్ ఫ్యాన్....ఇనుప మంచం...ఒక రేకు కుర్చీ...మసకబారిన అద్దం.ఆ గదిలో సత్తార్ ఉంటున్నాడు. కొద్దికాలం పిచ్చాసుపత్రిలో గడిపిన సత్తార్ ఇటీవలే బయటకు వచ్చాడు.మనుష్యులను చంపి వారి మెదళ్ళు తిన్నాడన్నా అభియోగం...అతని మీద వుంది...ఒక్కో సారి శాడిస్టిక్ గా ప్రవర్తిస్తాడు...తనలో తనే మాట్లాడుకుంటాడు...అతనిలో సైకో లక్షణాలు వున్నాయని కోర్ట్ విశ్వసించింది.ఆటను ప్రమాదకరమైన వ్యక్తిగా భావించింది.కొన్నాళ్ళు అతని ట్రీట్ మెంట్ అవసరమని భావించి ఆసుపత్రి లో ఉంచింది.
అక్కడ డ్యూటీ డాక్టర్ ని చంపి పారిపోయి వచ్చాడు.ఖాసిం కు నమ్మిన బంటు....మిలటరీ రహస్యాల పెన్ డ్రైవ్ అతని దగ్గరే వుంది.దానిలో కొన్ని రహస్య స్థావరాల వివరాలు డీకోడ్ చేయాలి...ఇలాంటి వాటి గురించి తెలిసిన వ్యక్తి ని కలసి వాటిని డీకోడ్ చేయించే బాధ్యత సత్తార్ ది.

****************************
ఖాసిం బాసింపట్టు వేసుకున్నాడు. అతను తిరుపతి వచ్చి అప్పుడే ఇరవై నాలు గంటలు దాటింది.మోహన ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చాడు.మిలటరీ రహస్య స్థావరాల వివరాలు డీకోడ్ చేసే వ్యక్తి కోసం సత్తార్ అన్వేషిస్తున్నాడు. రాష్ట్రపతి తిరుపతికి వచ్చేలోగా తను చేయవలిసిన పనులు చాలా వున్నాయి.రాష్ట్రపతి ని ఈ లోకం నుంచి తప్పించడం చిన్న విషయం కాదు...తనే దగ్గరుండి ఈ పనిని పూర్తిచేయాలి.బాంబ్ బ్లాస్ట్ స్కీం ఇక్కడ కుదరదు అని అర్ధమైంది.రివాల్వర్స్ ని పసిగట్టే డిటెక్టర్ లూ వచ్చాయి...
తిరుపతి క్షేత్రం ప్రశాంతం గా వుంది...రానున్న కొద్ది గంటల్లో ఒక మహా విధ్వంసం జరుగుతుందన్న విషయం అక్కడ ఎవరికీ తెలియదు.
మరో కొద్ది గంటల్లో రాష్ట్రపతి తిరుపతి వస్తున్నాడు.
సత్తార్ మిలటరీ రహస్యాలు డీకోడ్ చేసే వ్యక్తి కోసం బయల్దేరడాని సిద్ధం గా వున్నాడు.
అప్పుడే అతను వున్న గది తలుపు మీద శబ్దం వినిపించింది.
వచ్చింది ఎవరు? రూం బాయ్? లేదా...?
సత్తార్ దిండు కింద వున్న రివాల్వర్ బయటకు తీసాడు.
************************
ఆ రోజు ఉదయమే శ్రీనివాస్ ఈడూరి తిరుపతి వచ్చాడు.రాత్రి కార్తికేయ ఫోన్ చేసి విషయం చెప్పాడు.అర్జెంటు గా చేయవలిసిన పని చెప్పాడు.సత్తార్ కు సంబంధించిన ఫైల్ మెయిల్ చేసాడు.
సత్తార్ ఫోటో చూసి షాకయ్యాడు.ఒకప్పుడు తన చేతిలో చావుదెబ్బలు తిన్న వ్యక్తి.హైదరాబాద్ లో
ముగ్గురు అమ్మాయిలను ఘోరం గా చంపిన వ్యకి.
తిరుపతి రావడం తోనే ఫ్రెష్ అయి ,సరాసరి సత్తార్ వున్న హోటల్ గదికి వచ్చాడు.
*******************
దేవుడి గదిలోకి వెళ్ళాడు కార్తికేయ...అక్కడి దృశ్యం చూసి షాకయ్యాడు.పూజగదిలో దేవుడికి పూజ చేసింది మోహన.ఆధ్యాత్మిక భావాలను వెదజల్లే అగరొత్తుల పరిమళం....దేవుడి విగ్రహం ముందు మహామాన్వి ఖడ్గం.
మోహన ను సంహరించడానికి తీసుకు వచ్చిన ఖడ్గం...తనను చంపే ఆయుధానికి తనే పూజ చేస్తుందా?
రెండు చేతులు జోడించి దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకున్నాడు.
"దుష్టశిక్షణ కోసం నేను చేపట్టిన ఈ ఆయుధం మంచివారికి రక్షణ కలిగించాలి.నేను ఏ తప్పూ చేయకుండా,నా చేతిలోని ఈ ఖడ్గం అమాయకులను శిక్షించకుండా చూడు స్వామీ "
కార్తికేయ మాహామాన్వి ఆయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
ఒక్కసారిగా కార్తికేయ శరీరం జలదరించింది.వేన వేల విద్యుత్తు తరంగాలు తన శరీరం లోకి ప్రవేశించిన ఫీలింగ్ కలిగింది. ఏదో దివ్యత్వం తనను చుట్టుముట్టినట్టు....
మోహన కార్తికేయ వంకే చూస్తోంది.
ఆ ఇంటి చుట్టూ కాపలా రెట్టింపు అయింది
కార్తికేయ మోహన వైపు చూసాడు.ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.
"మీ మనసులోని కోరిక నేరవేరాలి "మనస్ఫూర్తిగా అని చేయి చాచింది.

*********************
సరిగ్గా గంట క్రితం ఓ అనూహ్య సంఘటన జరిగింది.ఇంటర్ పోల్ నుంచి వచ్చిన అధికారులకు మోహన కు సంబంధించిన సమాచారం తెలిసింది.ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ...దాంతో ఇంటర్ పోల్ ఎలర్ట్ అయింది.కార్తికేయ వుండగా మోహన ను చంపడం అసాధ్యం...మోహన ను హౌస్ అరెస్ట్ చేసిన కార్తికేయ ఇంట్లోనే చంపేయాలి...మోహన దగ్గర ఏ ఆయుధమూ వుండే అవకాశం లేదు.
ఆ విధం గా కార్తికేయకు తెలియకుండానే అక్కడి బందోబస్తు రెట్టింపు అయింది.

No comments: