ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 20 April 2013

విసురజ (సీరియల్ )
ఆగష్టు1...
డేట్ తో డిష్యుం...డిష్యుం
.................................
పాఠక శ్రేణులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు
19-04-2013 (9th chapter)
........................................
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
............... ****** .......................
"ఏ క్షణమైనా తను అవుట్...అయినా ఒసే సంధూ నీకివన్నీ ఎందుకే....నిన్ననే షాంపూ లేకుండా తలంటకున్నావు...అప్పుడే ఈ సీన్ అవసరమా? ఇక్కడి నుంచి పారిపోతే ఎలా వుంటుంది..? తన భ్రమ కాకపోతే సెక్యూరిటీ కామ్ గా ఉంటుందా? " తనని తానే తిట్టుకుంది.
చంద్రహాస్ స్పీకర్ ఆన్ చేసాడు..."గుడ్ మార్నింగ్ ..నేను చంద్రహాస్....మీ మేగజైన్ లో సంధ్యాజ్యోతి అనే అనే జర్నలిస్ట్ వర్క్ చేస్తున్నారా?
ఒక్క క్షణం అటు వైపు నుంచి నిశ్శబ్దం....అయిపోయింది "కుమ్మేయండి" అని చెబుతాడు. ఆరో అంతస్థు నుంచి తనని విసిరేస్తే టికెట్ లేకుండా బస్సు ఎక్కకుండా, ఎ వాహనము అవసరము లేకుండా తన ఆఫీసు గేటు ముందు పడుతుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది.
"యస్ చేస్తున్నారు...ఎనీ ప్రాబ్లం? ఎడిటర్ అడిగాడు.
"నథింగ్...జస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానని చెప్పారు...థాంక్యూ" అంటూ ఫోన్ కట్ చేసాడు.
++++++ ++++++ ++++++
"ఇది మీ మొదటి ఇంటర్వ్యూనా? అడిగాడు చంద్రహాస్
అవునన్నట్టు తలూపింది సంధ్య
"ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే మూడ్ లో లేను ....మరో సారి రండి " చెప్పాడు చంద్రహాస్.
" మరి నన్ను రమ్మని పిలిచారు? మా ఎడిటర్ గారితో మాట్లాడారు"
"నాకు మీడియా అంటే గౌరవం...కింద మీరు గొడవ పడుతుంటే పిలిచాను..ఐ.డి. లేకుండా వచ్చారు...మీరు నిజంగా జర్నలిస్ట్ అవునో, కాదో అని క్లారిఫై చేసుకున్నాను"
"మరి ఇది మొదటి ఇంటర్వ్యూనా" అని అడిగారు "చిన్న పిల్లలా సందేహ నివృత్తి చేసుకుంటోంది.
"ఒక బిజినెస్ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ప్రాసెస్ వుంటుంది. అపాయింట్ మెంట్ తీసుకోవాల్సివుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రశ్నావళి ఇవ్వాల్సి వుంటుంది. అలాంటిదేమీ లేకుండా డైరెక్ట్ గా వచ్చేశారు .." అందుకని ...
"సారీ సర్...ఒక అరగంట సర్..ఎట్ లీస్ట్ పావుగంట..." చిన్న పిల్ల మారాం చేస్తున్నట్టు" అనిపించింది చంద్రహాస్ కు.
మరో టైం లో అయితే "ఓకే" అనేవాడే...కానీ ఇప్పుడు తను చేయవలిసిన పనులు చాలా వున్నాయి. ప్రణవికి సంబంధించిన యాడ్ ఇవ్వాలి. మిర్రర్ డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్ళాలి.
"సర్ మీ గురించి...అదే మిమ్మలిని ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని పొద్దున్నే వచ్చాను..ప్రామిస్ ...బ్రేక్ ఫాస్ట్ కూడా చేయలేదు..మీకు ఇంకో నిజం చెప్పాలి...అని మెల్లిగా టేబుల్ మీదికి వంగి.."నేను మీ దగరికి వస్తున్నట్టు మా ఎడిటర్ సర్ కు కూడా తెలియదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాననుకోండి..హ్యాపీ ఫీల్ అవుతారు...లేదంటే ఇటు నుంచి ఐటే ఇంటికి వెళ్ళాలి...సర్...మిమ్మల్ని చూస్తుంటే కరుణామయుడులా వున్నారు...హెల్ప్ మీ సర్..." మొహాన్ని దీనంగా పెట్టి అడిగింది.
సంధ్యకు ఫ్యూచర్ సెవెంటీ ఎం ఎం లో కనిపిస్తుంది.
"సారీ...మరో సారి చూద్దాం" అంటూ లేచాడు.
"అప్పుడు మీ సెక్యూరిటీ మెడ పట్టి గెంటేస్తారు...ప్లీజ్ సర్ పోనీ టెన్ మినిట్స్" సంధ్య అంది. ఎలాగైనా చంద్రహాస్ ని ఇంటర్వ్యూ చేయాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది.
చంద్రహాస్ లేచి బయటకు నడవబోతుంటే టేబుల్ మీద వున్నా ఫైల్ కింద పడింది. అందులోని కాగితాలు నేల
మీద పడి చెల్లాచెదురయ్యాయి. సంధ్యాజ్యోతి కిందికి వంగి ఆ పేపర్స్ తీసింది. అందులో ప్రణవికి సంబంధించిన యాడ్ వుంది.
వాటి వంక చూసి "ఈ యాడ్ బాగాలేదు సర్....అయినా యాడ్ ఇలా ఇస్తే ఎవరు చూస్తారు...డిఫెరెంట్ గా వుండాలి" అంది.
బయటకు నడవబోతున్న చంద్రహాస్ ఆగి "ఇంత కన్నా బాగా రాయగలరా?"అని అడిగాడు.
"గలను సర్...సారీ రాయగలను సర్.." అంది సంధ్య
బయటకు వెళ్ళబోయిన చంద్రహాస్ వెనక్కి వచ్చి సీట్ లో కూచున్నాడు.
"సర్ నేను కూడా కూచోవచ్చా? అడిగి పర్మిషన్ కోసం ఎదురుచూడకుండా కూచుంది.
========== =================
అందమైన కాలనీ...
ఆ కాలనీలో చిత్రకారుడు గీసిన బొమ్మలా, బొమ్మరిల్లులా ఓ ఇల్లు....
ఇంటి ముందు గులాబీ మొక్కలు, బంతి పూల చెట్లు ...గేటుకు ఇరువైపులా మల్లెతీగ అల్లుకుంది...ఆ ఇంటి అనురాగంలా...
ఇంటి లోపల విశాలమైన హాలు ...ఆ హాలులో అందమైన అమ్మాయి...ఆమె చేతిలో భర్త ఫోటో వుంది. ఆ ఫోటో వంకే తదేకంగా చూస్తోంది. ఫోటోలో భర్త చిరునవ్వుతో తననే చూస్తున్నాడు..ఆమె కళ్ళు ఒక్కసారిగా తడిబారాయి.
అప్పుడప్పుడు ఫోన్ వంక చూస్తోంది. ఆమె ఆలోచనను పసిగట్టినట్టు ఫోన్ మోగింది...అదీ ల్యాండ్ ఫోన్ ...
ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె చేతిలోని భర్త ఫోటో జారికింద పడబోయింది. చప్పున ఫోటో కిందపడకుండా చేత్తో పట్టుకుంది.
============ ===============
ల్యాండ్ ఫోన్ అదే పనిగా మోగుతుంది. వెంటనే ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ లిఫ్ట్ చేసింది.
"హలో...మీరు అందమైన అమ్మాయే కాదు...అందంగా హత్య చేసే అమ్మాయి కూడా " తెరలు తెరలుగా నవ్వు...భయంతో వణికిపోయింది.
అప్పుడే డోర్ బెల్ మోగింది, వచ్చింది ఆమె భర్త..రాధాచంద్రిక భర్త.
==================
(ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరు? సంధ్య చంద్రహాస్ కు ఇచ్చిన ఐడియా ఏమిటి? రేపటి సంచికలో)

No comments: