ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 20 April 2013

విసురజ (సీరియల్ )ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
18-04-2013 (8th chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
సుకన్య...
తెగువ, షార్ప్ నెస్,సిన్సియారిటీ ఈ మూడు లక్షణాలు వున్న కారణం గా డిటెక్టివ్ ఏజెన్సీ లో చేరిన కొద్దికాలానికే మంచి పేరు తెచ్చుకుంది.చైర్మన్ దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలదు.సుకన్య కేసును డీల్ చేసే పద్దతి విభిన్నం గా వుంటుంది.అవసరమైతే అర్ధరాత్రుళ్ళు మెలుకువగా వుంటుంది. ఆమెకు ఓ కేసు అప్పగిస్తే అది పూర్తయ్యేవరకు వదిలిపెట్టదు.
చైర్మన్ మాళవిక ,సుకన్య ఇద్దరే వున్నారు చాంబర్ లో...
"చెప్పండి సుకన్య ...మీ వర్క్ ఎంత వరకు వచ్చింది? అడిగింది మాళవిక.
"మేన్ రోబో ఎడిటర్ గారిని కలిసాను.వాళ్ళ మేగజైన్ లో సంధ్యాజ్యోతి అనే అమ్మాయి జర్నలిస్ట్ గా జాయిన్ అయింది.ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోమని చెప్పారు. కాస్త అల్లరిగా కనిపిస్తుంది కానీ చాలా సిన్సియర్ అని తేలింది.నిజం చెప్పాలంటే ఆమె మన డిటెక్టివ్ ఏజెన్సీ లో వుండాలి " చెప్పింది సుకన్య.
"మీ కళ్ళు ఎర్రగా వున్నాయి ...ఏమైంది? అడిగింది మాళవిక.
"రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్ళి వస్తుంటే ఓ బస్సు లో కొందరు ఆకతాయిలు అమ్మాయిలను ఏడిపిస్తున్నారు. బస్సు ను సరాసరి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళమని డ్రైవర్ కు చెప్పాను. బస్సు లో అమ్మాయిలు వున్నారు .ఎందుకైనా మంచిదని దగ్గరుండి వారిని ఇంటి దగ్గర దిగబెట్టాను. మరో నిర్భయ ఇన్సిడెంట్ జరగకూడదు."సుకన్య చెప్పింది.
"గుడ్...నీలా ప్రతి నలుగురిలో ఒక్కరు ఆలోచించినా చాలు."మనస్ఫూర్తిగా అంది మాళవిక.
తర్వాత టేబుల్ మీద వున్న కవర్ తీసి "సుకన్యా...మీకో ఇంట్రస్టింగ్ కేసు..."అంటూ హర్ష గురించి చెప్పింది.కవర్ సుకన్య కు ఇచ్చింది.ఈ కేసు డీల్ చేయవలిసింది మీరే."అంది.
"కేసు ఇంట్రస్టింగ్ గా వుంది.ఈ క్షణమే మొదలు పెడతాను "అంటూ లేచింది.
"ఓకే ఆల్ ది బెస్ట్ "చేయి చాచి అంది మాళవిక.
****************
పది అంతస్థుల బిల్డింగ్ ....
కట్టుదిట్టమైన భద్రత...ప్రణవి గ్రూప్ అఫ్ కంపెనీస్ చిరునామా...ఆరవ అంతస్థులో వున్నాడు చంద్రహాస్...
ఏసీ పని చేస్తోన్నా చల్లదనం అనిపించడం లేదు.అతను కూచోన్న రివాల్వింగ్ చైర్ కు ఎదురుగా ప్రణవి నిలువెత్తు పెయింటింగ్ వుంది. టేబుల్ మీద చిరునవ్వుతో తననే చూస్తోన్న ప్రణవి ఫోటో.
అతని ఎదురుగా లాప్ టాప్ ...స్క్రీన్ మీద క్లాక్ వైజ్ గా తిరుగుతున్న ప్రణవి ఇమేజ్.
అతని ఎదురుగా చేతులు కట్టుకుని పి ఏ వున్నాడు."సర్ మీరు చూడవలిసిన ఫైల్స్ చాలా పెండింగ్ లో వున్నాయి "వినయంగా ,భయంగా చెప్పాడు.
"ఫైల్స్ వర్క్ మరో ఇరవై నాలుగు గంటలు పోస్ట్ పోన్ చేయండి."చెప్పాడు చంద్రహాస్.
"అలాగే సర్.."అంటూ వెళ్ళబోయాడు.
"వన్ సెకన్ "పిలిచాడు చంద్రహాస్ .
వెంటనే వెనక్కి వచ్చాడు పి ఏ ..
"ఓ సారి పిఆర్వోని రమ్మను "
"ష్యూర్ సర్ "అని బయటకు వెళ్ళాడు.అతను వెళ్ళిన మూడవ నిమిషం పిఆర్వో వచ్చాడు.

*************
"యాడ్ తయారు చేసారా ? "అడిగాడు చంద్రహాస్.
"అయిపొయింది సర్...ఒక్కసారి మీరు చూసి ఓకే అంటే న్యూస్ పేపర్స్ కి పంపిస్తాను."పిఆర్వో చెప్పాడు.
"న్యూస్ పేపర్స్ మాత్రమే కాదు...టీవీ చానెల్స్,వెబ్ సైట్స్ ,రేడియో అన్నింట్లోనూ రావాలి "చెప్పాడు చంద్రహాస్.
"తప్పకుండా సర్..."అని తన చేతిలోని ఫైల్ చంద్రహాస్ చేతికి ఇచ్చాడు.ఆ ఫైల్ లో అతను తయారు చేసిన మేటర్ వుంది.
కనబడుట లేదు ..
పై ఫోటోలోని ప్రణవి అనే మహిళ కనబడుటలేదు.ఆచూకి తెలిపినవారికి భారీ బహుమానం కలదు.
ప్రణవికి సంబంధించిన వివరాలు,ఆచూకి తెలియజేయవలిసిన చిరునామా,ఫోన్ నంబర్లు వున్నాయి.
"ఇంతకన్నా బెటర్ గా యాడ్ తయారు చేయలేరా ?అడిగాడు చంద్రహాస్
"అంటే సాధారణం గా తప్పిపోయిన వారి ప్రకటనలు ఇలానే ఉంటాయని..."అని ఆగాడు చంద్రహాస్ మొహం లోని ఫీలింగ్స్ చూసి .
"ప్రణవి మేడం తప్పి పోలేదు.మిస్సయింది.మంచి కాపీ రైటర్ ని చూడండి "చెప్పాడు చంద్రహాస్.
సరిగ్గా అదే సమయం లో....
రిసెప్షన్ లో ఓ అమ్మాయి గొడవపడుతుంది. వెంటనే తన చేతిలో వున్న రిమోట్ లోని ఒక బటన్ ప్రెస్ చేసాడు...అతి ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం తో తయారైన కెమెరాలు...రిసెప్షన్ లో జరిగే దృశ్యాన్ని క్లోజప్ లో చూపిస్తుంది.
అక్కడ ఒకమ్మాయి ఆర్గ్యూ చేస్తుంది. సౌండ్ బటన్ నొక్కాడు.మాటలు స్పష్టం గా టీవీ లో వినిపించినట్టు వినిపిస్తున్నాయి.
"నేను మీ చైర్మన్ గారితో మాట్లాడాలి.నేను ప్రెస్ తెలుసా.."ధభాయిస్తోంది ఆ అమ్మాయి.సెక్యూరిటీని కూడా లెక్క చేయడం లేదా అమ్మాయి.
"ఆ అమ్మాయిని పంపించండి "చెప్పాడు చంద్రహాస్.
ఆ అమ్మాయి సంధ్యాజ్యోతి.
చంద్రహాస్ ఆమె వంక చూసి "ఏమిటి మీ ప్రాబ్లెమ్ ? అడిగాడు.
"మీ సెక్యూరిటీ...అరె...నేను ప్రెస్ అన్నా వినరే...మీరు చూడండి ...ఎంత దిసేంట్ గా వున్నారో ? గబా గబా చెప్పేసి ఆగింది.నిజం చెప్పాలంటే సంధ్యాజ్యోతికి చాలా టెన్స్ గా వుంది..."తను మాట్లాడుతుంది...ఒక వ్యాపార దిగ్గజం తో అని తెలుసు...రాత్రి తాలూకు ఉద్వేగం ఇంకా తగ్గలేదు...అందుకే చీఫ్ ఎడిటర్ ని ఇంప్రెస్ చేయాలని పొద్దున్నే వచ్చింది.చంద్రహాస్ కారు వచ్చే వరకూ ఆగింది,,,,సెక్యూరిటీ ధభాయించి లోపలి వచ్చింది.
"మీ ఐ డి చూపించండి "చంద్రహాస్ అడిగాడు.
సంధ్యాజ్యోతి షాకైంది, ఐ డి అడుగుతారన్న చిన్న విషయాన్ని విస్మరించింది.ఒక బిజినెస్ టైకూన్ ని కలుసుకోవడం అంత తేలికైన విషయం కాదన్న విషయాన్నీ విస్మరించింది.
"ప్లీజ్ షో యువర్ ఐ డి "
"చెప్పండి...మీరే మీడియా ?చంద్రహాస్ అడిగాడు.
"మేన్ రోబో "గొంతు పెగుల్చుకుని చెపింది
చంద్రహాస్ మేన్ రోబో ఆఫీసుకు ఫోన్ కలిపాడు .
సంధ్యాజ్యోతి లో టెన్షన్ మొదలైంది.."అయిపొయింది...నిన్ననే వార్నింగ్ ఇచ్చాడు...కనీసం తను చెప్పి వచ్చినా బావుండేది...ఒసే సంధ్యా నువ్వు ఫినిష్ "అనుకుంది.
అటువైపు నుంచి ఎడిటర్ మాట్లాడుతున్నాడు.
ఎడిటర్ ఏం చెప్పాడు ?ఇంతకీ రాదాచంద్రిక ఎవరు ?రేపటి సంచికలో )

No comments: