ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

1) మనిషికి ఇంట్లో భార్య నేస్తం, రోగాలు బాధించే వయసులో ఔషధాలే నేస్తాలు మరి మరణించిన తరువాత తను ఆచరించిన ధర్మమే నేస్తం.

2) విషయ భోగాలు విషం కన్నా విషమైనవి, విపరీతాలు ఇచ్చేవి, మితి మీరి కాంక్షిస్తే జీవితాన్ని విషమంగా చేస్తాయి.

3) పరిస్థితులనుంచి తప్పించుకుని పారిపోయి ఎక్కడో దాక్కున్నా నిను వీడి అంతారాత్మ ఎక్కడకు వెళ్ళాదుగా. నిన్ను ప్రతిక్షణం నిగ్గదీసేనుగా.

No comments: