ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday 28 April 2013

విసురజ (సీరియల్ ) ఆగష్టు1

టాగ్ లైను ..డేట్ తో డిష్యుం...డిష్యుం
22-04-2013 (12th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
"టెన్ ఎవెన్ హోటల్ ''
అతి ఖరీదైన హోటల్ మాత్రమే కాదు...అసాంఘీక కార్యకలాపాలకు, కేరాఫ్ చిరునామా...
మాఫియాకు సంబంధించిన డాన్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. పటిష్టమైన సెక్యూరిటీ....పోలీసు అధికారులు వచ్చినా అక్కడి సెక్యూరిటీ చీఫ్ పర్మిషన్ తీసుకోవలిసిందే. అవినీతి ఆరోపణలతో, మాఫియాతో లింకులు వున్నాయని డిస్మిస్ చేయబడిన ఓ పోలీసు ఉన్నతాధికారి ఆ హోటల్ కు సెక్యూరిటీ చీఫ్. ఓ కేంద్ర మంత్రి అండ...విదేశాల్లో తలదాచుకుంటున్న ఓ మాఫియా డాన్ ఆశీస్సులతో ఆ హోటల్ నడుస్తోంది. అక్కడికి వచ్చే ప్రతీ వ్యక్తికీ సెక్యూరిటీ వుంటుంది.
ఆ హోటల్ చట్టు పటిష్టమైన భద్రత. నలువైపులా మారణాయుధాలు కాపలా కాస్తూనే వుంటాయి. థర్డ్ ఫ్లోర్
...కాన్ఫరెన్స్ హాల్ ....సుమారు యాభై మంది వరకు కూచోనే వీలున్న రౌండ్ టేబుల్ ....సౌండ్ ఫ్రూఫ్ హాల్. టైట్ సెక్యూరిటీ ....ఆ హాల్ లోపలికి ప్రవేశించగానే ఆటోమేటిక్ గా ప్రవేశించిన వ్యక్తి శరీరాన్ని స్కాన్ చేసే ఏర్పాటు చేయబడింది.
దేశ విదేశాల నుంచి అక్కడికి మాఫియా తరలివస్తుంది. ఆ సమావేశానికి దావూద్ కూడా వస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు ...స్పెషల్ టీంగా ఏర్పాటై అక్కడ కాపు కాశారు. చట్టం చాలా గొప్పది అయినా...సాక్ష్యం అనే ఊపిరి అందనప్పుడు విల విల్లాడిపోతుంది. అక్కడ మాఫియా సమావేశం జరుగుతున్నాదని తెలిసినా ఆధారాలు లేనప్పుడు నిస్సహాయంగా వుండిపోవాల్సివస్తుంది.
============
కాన్ఫరెన్స్ హాల్ లోకి ఒక్కరొక్కరు వస్తున్నారు. మాఫియాలోని అతి ముఖ్యమైన వ్యక్తులు ఇలా సమావేశం కావడం పదేళ్ళ తర్వాత మొదటి సారి.ఆ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణ స్టీఫెన్ ...స్టీఫెన్ ఎడ్వర్డ్ ...ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి. బిజినెస్ మేన్ ముసుగులో వున్న మాఫియా డాన్...అన్ని రాజకీయ పార్టీలతోనూ, అధికార, ప్రతిపక్షాలతోనూ సన్నిహిత సంబంధాలు కలిగివున్న వ్యక్తి. తన వ్యాపారానికి బ్లాక్ మెయిలింగ్ ప్రధానమైన ముడుసరుకు అని భావించే వ్యక్తి. తన ప్రత్యర్ధుల బలం మీద కన్నా బలహీనతల మీద అతని దృష్టి వుంటుంది.
ఈ రోజు అతను అక్కడి రావడానికి కారణం....చంద్రహాస్... ఇచ్చిన ప్రకటన.
===========
ఒక్కసారిగా నగరంలోనే కాదు...దేశంలోనూ సంచలనం...ఆ సంచలనానికి కారణం ప్రణవికి సంబంధించిన ప్రకటన. ప్రతి రోజు మిస్సింగ్ ప్రకటనలు సర్వసాధారణం. కానీ ఈ ప్రకటన అసాధారణం. చంద్రహాస్ పేరు తెలియని వారు అరుదు. కేవలం ఒక బిజినెస్ మేన్ గానే కాక మీడియాలో తరచూ వినబడే పేరు.
ఆ రోజు ఉదయమే అన్ని ప్రధాన పత్రికల్లో అతనిచ్చిన ఆ ప్రకటన వచ్చింది. టీవీ చానెల్స్ లో, వెబ్ సైట్స్ లో...
==============
జనం రకరకాలు. పొద్దున్నే లేచి దినపత్రికలోని హెడ్ లైన్స్ చదివి వదిలేసేవారు కొందరైతే....ఆ వార్తల గురించే చర్చించేవారూ వుంటారు. కొందరు సినిమా పేజీకి పరిమితం అయితే మరికొందరు బిజినెస్ పేజీ, ఇంకొందరు ఉమెన్స్ పేజీ... ఇలా అందరినీ ఆకట్టుకుంది ఆ పత్రిక. కొందర ఔత్సాహికులు ప్ప్రణవిని వెతికితే ఎలా ఉంటుందా? అని ఆలోచనలు మొదలుపెట్టారు.
చంద్రహాస్ ఆఫీసుకు ఫోన్ కాల్స్ తాకిడి మొదలైంది. ఆ ప్రకటన చూసి ముందు షాకైన వ్యక్తి సంధ్యాజ్యోతి. కొద్ది గంటల క్రితమే తను కలిసింది. ఇంతలోనే..? టిఫిన్ కూడా చేయకుండా ఆఫీసుకు బయల్దేరింది...ఎందుకంటే ఆ ప్రకటన్ మేన్ రోబో లో కూడా వచ్చింది...
==============
పెంట్ హౌస్...
కర్రకాలు శబ్దం వినగానే అక్కడ వున సాయుధులు ఎలర్ట్ అయ్యారు. రామతీర్థం పెంట్ హౌస్ లో వున్న హాల్ లోకి వచ్చాడు. అక్కడ తుపాకులతో కాపలా కాస్తున్నారు కొందరు. రామతీర్థాన్ని చూసి అంతా స్టిఫ్ గా నిలబడి సెల్యూట్ చేసారు.
రామతీర్థం నేల మీద పరచిన రెడ్ కార్పెట్ మీద కూచున్నాడు. అతడిని చూస్తుంటే సెక్యూరిటీకి అప్పుడప్పుడు ఒంట్లో వణుకు పుడుతుంది. రామతీర్థం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఎప్పుడైతే అతను నేల మీద కూచున్నాడో, సెక్యూరిటీ కూడా కింద కూచుంది. రామతీర్థం రెండుచేతులూ తలకింద పెట్టుకుని కార్పెట్ మీద పడుకుని సీలింగ్ వంక చూస్తున్నాడు.
"మీరంతా కాఫీలుతాగారా, టిఫినీలు చేసారా? సీలింగ్ వంకే చూస్తూ అడిగాడు తన కర్రకాలుని అటు ఇటూ కదుపుతూ....
అందరూ తలలూపారు బుద్ధిగా..."గుడ్..వెరీ గుడ్, ఇప్పుడు నేను మీకొక కథ చెబుతాను...ఆ తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్నకు, తెలిసినా, తెలియకపోయినా సమాధానం చెప్పాలి. అలా చెప్పకపోతే చచ్చిపోతారు...వెరీ సింపుల్" అంటూ కర్ర కాలును నేల మీద తాటించాడు.
సెక్యూరిటీలో ముచ్చెమటలు....
కథ చెప్పాక జరిగే పరిణామం వేరే....
==============
ప్రణవి ఎంపైర్ ...
చంద్రహాస్ రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి అలసటగా కళ్ళు మూసుకునాడు. ఎదురుగా పి.ఏ. ...ఉదయం నుంచి నాన్ స్టాప్ గా ఫోన్ కాల్స్...దేశం నలు మూలలనుంచి. పిఏకు దాదాపు చాలా భాషలు వచ్చు
బెంగుళూర్, చెన్నై, ఆంధ్రప్రదేశ్ ...నుంచి. ఆకతాయిల ఫోన్ కాల్స్,ఆరాలు తీసే ఫోన్ కాల్స్...మేము చూసామని కొందరు..వెతికి పట్టుకుంటామని మరికొందరు...ప్రతీ కాల్ లోని సంభాషణ, టైం రికార్డ్ చేయిస్తున్నాడు చంద్రహాస్.
దాదాపు మూడు వందల నలభై కాల్స్...మూడు గంటల వ్యవధిలో ....రికార్డ్ చేయబడిన ఆ కాల్స్ ఆడియోని మరో సారి వింటున్నాడు చంద్రహాస్. వైజాగ్ నుంచి వచ్చిన ఒక కాల్ మీద దృష్టి పెట్టాడు. ఒకమ్మాయి చేసిన కాల్. "ప్రణవి వైజాగ్ లో కనిపించింది"అని ఆ అమ్మాయి చెప్పిన కాల్.
===============
"టెన్ ఎవెన్ హోటల్"..
రౌండ్ టేబుల్ ను మాఫియా ఆక్రమించుకుంది.టేబుల్ మధ్యలో న్యూస్ పేపర్స్ దొంతర...అన్ని రాష్ట్రాల నుంచి వెలువడే దినపత్రికలు, అన్ని భాషలలోని పత్రికలూ...అన్ని పత్రికల్లోనూ వచ్చిన ఓ కామన్ యాడ్ చుట్టూ, మార్కర్ పెన్ తో మార్క్ చేయబడిన యాడ్...ఆ యాడ్ ప్రణవికి సంబంధించింది. స్టీఫెన్ ఎడ్వర్డ్ లేచి అక్కడ వున్నా వారిని ఉద్దేశిస్తూ .."మై డియర్ ఫ్రెండ్స్ నేను ఇన్వయిట్ చేయగానే విచ్చేసిన మీకు థాంక్స్..మనం ఇన్నాళ్ళు ఏ విషయం లో నిశ్చింతగా ఉన్నామో..ఇప్పుడు ఆ విషయమే మనల్ని చాలెంజ్ చేస్తుంది .ఈ పేపర్స్ చూడండి...ఈ ప్రకటన చూడండి
"చంద్రహాస్ ...నా ప్రియమైన శత్రువు ఇచ్చిన ప్రకటన...ఇన్నాళ్ళు కామ్ గా వుంది. ప్రెస్ అడిగినా ప్రణవి మిస్సింగ్ గురించి పెదవి విప్పని చంద్రహాస్ ఇప్పుడు డైరెక్ట్ గా యాడ్ ఇచ్చాడు...అదీ పెద్ద మొత్తం ఆఫర్ చేస్తూ....వై ? ఎందుకు ..."అందరి వైపు చూసి ఆగాడు.
"ఎందుకంటే చంద్రహాస్ తెలివైనవాడు కాబట్టి...మన వల్ల ప్రణవికి ప్రాణ భయం వుందని ఊహిస్తున్నాడు కాబట్టి..మనకు చెక్ పెట్టాలి కాబట్టి " కొనసాగిస్తూ తనే చెప్పాడు స్టీఫెన్.
===========
(చంద్రహాస్ మైండ్ గేమ్ రేపటి సంచికలో)

No comments: