ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

కవిత: రాధప్రేమ ఫిర్యాదు
............................... 

Photo: కవిత: రాధప్రేమ ఫిర్యాదు 
............................... 
పగటివెలుగు నా ప్రేమల్లే లోకమంతటా ప్రాకిపోయే
అయినా నీవు రాలేదు ప్రియమైన కన్నయ్య
నను చేర నీ రాకకు విలంబం ఏలనయ్యా
ఏ చుప్పనాతి నీ కళ్ళకు కానవచ్చిందయ్యా
నీ హృది మల్లికను మది రాధను అనురాగ అమృతాన్ని నేను కానటయ్యా 
జాగేలనయ్యా..బేగ రావయ్య నల్లనయ్య మరెవర్ని దువ్వక రాధారమణయ్య 

సంధ్యాకాంతులు వలపు దీపాలల్లే జగతిని చేపట్టే
అయినా నీవు రాలేదు ప్రియమైన కన్నయ్య  
నను చేర నీ రాకకు విలంబం ఎందుకయ్యా
ఏ చెల్లిసవతి నీ కాళ్ళకు పదమంజీరాలు వేసేనయ్యా
నీ సఖి సరోజను సరస సురసను ప్రేమ మధిరాన్ని నేను కానటయ్యా

నిశిరేయి విరాహాగ్నిలో కాలి నుసి నుసియాయే
అయినా నీవు రాలేదు ప్రియమైన కన్నయ్య 
కన్నయ్య నను చేర నీ రాకకు విలంబం కూడదయ్యా 
ఏ టక్కులాడి నీ చంచల బుద్దికి ఉత్ప్రేకరాలు అందించిదయ్యా
నీ చెలి చామంతిని మధురూహాల వలపు సరస్సుని నేను కానటయ్యా 

.....
విసురజ 

No comments: