ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 12 April 2013

ముగ్ధమోహనం సీరియల్ పై కురిసిన అభినందనల ప్రతిస్పందన ....
.............................................................................
ముగ్ధమోహనం సీరియల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఏరోజూ మిస్ కాకుండా చదువుతున్నాను. ఒక రచయిత మొదటి సీరియల్ ఇంత అద్భుతంగా ఉంటుందా "ఒక సీరియల్ లో ఇన్ని మలుపులు, ట్విస్ట్ లు ఉంటాయా? ఒక నెగిటివ్ పాత్రను ఇంత పాజిటివ్ గా వీక్షకులు కంట తడి పెట్టేలా రాయగలరా? ఏ పాత్రనూ వృధాగా పోనివ్వలేదు. ప్రతీ పాత్రకు ఓ అర్ధం, పరమార్ధం వుంది. మా కళ్ళు అక్షరాల వెంట పరుగెడుతున్నాయా? అక్షరాలూ మమ్మల్న వెంటాడుతున్నాయా? జర్దార్ లాంటి విలన్ ని ఒక షేర్ ఖాన్ ని చేసారు. మోహన పాత్రని ఎక్కడికో తీసుకువెళ్ళారు...ఈ సీరియల్ రాయడానికి మీరు పడ్డ కష్టం తెలుస్తోంది. సీరియల్ అప్పుడే అయిపోయిందా? మీ సీరియల్ మా కళ్ళ ముందు కదలాడుతుంది. చాలా కాలం తర్వాత ఒక మంచి సీరియల్ చదివామన్న త్రుప్తిని కలిగించిన విసురజ గారికి, మేన్ రోబో కు కృతఙ్ఞతలు. ----ఆర్.శివ సత్యనారాయణ (కడప)
ముగ్ధమోహనం మరికొన్ని రోజులు వస్తే బావుండేది. ఈ సీరియల్ చదవకుండా ఉండాలంటే మనసుకు కష్టంగా వుంది.---శ్రీమతి శిరీష (విజయవాడ)

ముగ్ధమోహనం నవల రూపంలో వస్తుందా? రచయిత ఆటోగ్రాఫ్ తో ఆ నవల ను మేము పొందవచ్చా? --కిరణ్మయి (హైదరాబాద్)
*************ఏప్రిల్ చివరి వారంలో మీ కోరిక నెరవేరుతుంది.---ఎడిటర్************

No comments: