ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 2 April 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---66)
(1-04-2013)
............
తిరుపతి...
రాష్ట్రపతి తిరుపతికి ఆ రోజే వస్తున్నాడు. మొత్తం బందోబస్తు పూర్తయింది.ఎ క్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు...
రాష్ట్రపతిని చేరాలంటే కాన్వాయ్ ని చీల్చుకుని వెళ్ళాలి. జడ్ కేటగిరి భద్రత...ఏ మాత్రం తేడా వచ్చినా జరుగబోయేది వేరు.
శ్రీనివాస్...ఉత్తర ద్వారం వైపు వున్నాడు...సి బి ఐ చీఫ్ మెరికల్లాంటి అధికారులను సెక్యూరిటీగా నియమించాడు... ఓ పక్క నిఘావర్గాలు....పోలీసులు....వీళ్ళ మధ్య ఖాసిం ....

***********************
పాడుబడిన ప్రాంతంలో కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఇల్లు...అందులో ఖాసిం వున్నాడు...అతని ఎదురుగా వంద మందికి పైగా ఆత్మాహుతి దళం...ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన వారు...కరుడుగట్టిన నర హంతకులు...డబ్బు కోసం కన్న వారిని తెగనరికే కసాయిలు వున్నారు. వాళ్లకు ప్రాణం మీద ఆశ లేదు..వాళ్ళ మనస్సులో విద్రోహాన్ని, విద్వేషాన్ని నింపాడు ఖాసిం.

రాగులుతోన్న అగ్నిపర్వతంలా వున్నాడు ఖాసిం...తన సోదరుడు యాహ్యాఖాన్ ని మోహన చంపడం....జర్దార్ చనిపోవడం...సత్తార్ ఎన్ కౌంటర్...ఇవన్నే అతనిలో వణుకు పుట్టిస్తున్నాయి.

*******************

ఖాసిం తన ఎదురుగా వున్న ఆత్మాహుతి దళం వైపు చూసాడు. గొంతు విప్పాడు..."ఇది జీహాద్..మనం చేసే పవిత్ర యుద్ధం..మీరంతా ప్రాణాలకు తెగించాలి...మనం మన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. మీ కోసం అంతులేని సంపద ఎదురుచూస్తుంది." ఖాసిం వాళ్ళ బలహీనతలతో ఆడుకుంటున్నాడు.

అక్కడున్న వాళ్ళంతా ట్రాన్స్ లో వున్నట్టు వింటున్నారు...వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు...వాళ్ళ శరీరంపై బాంబులు...బెల్ట్ బాంబులు...ఏ క్షణం ప్రమాదం ముంచుకు వచ్చినా చనిపోవడానికి వాళ్ళు సిద్ధంగా వున్నారు. తొంబై వయసు దాటినా పండు వృద్దులతో రాష్ట్రపతి సమావేశం అవుతున్నాడు. వాళ్ళ పుట్టిన రోజు వేడుకులను దగ్గరుండి మరీ జరిపిస్తున్నాడు. మీరు నలువైపులా తిరుపతిని చుట్టుముట్టండి. నేను ముదుసలి వేషంలో వెళ్తాను...నా చేతి కర్రలో వున్న ఈ తల్వార్ తో...చేతి కర్ర పిడి విప్పాడు...పదును తేలిన తల్వార్ ..చేతి కర్రలో నుంచి ప్రత్యక్ష్యమైంది.ఈ తల్వార్ తో రాష్ట్రపతి తల నేల రాలుతుంది. ఈ లోగా మీరు నాలుగు వైపుల నుంచి విధ్వంసం సృష్టించండి." ఖాసిం చెప్పి లోపలి వెళ్లి పదిహేను నిమిషాల్లో వచ్చాడు. అతనిప్పుడు పండు ముదుసలి గెటప్ లో వున్నాడు. అతని చేతిలి కర్ర...తల్వార్ వున్న కర్ర. ఆ పాడుబడిన ఇంటి ముందుకు ఓ మిలిటరీ జీపు వచ్చింది. అందులో నుంచి ఎనిమిది మంది నలుపు రంగు దుస్తులతో దిగారు. పలు ఉగ్రవాద సంస్థల అధిపతులు...అందులో ముఖ్యమైన వ్యక్తి హుస్సేన్ ..ఖాసిం ద్వారా ఈ ఎటాక్ ని జరిపిస్తోన్న వ్యక్తి. మోహన ఆవేశాన్ని, ఆలోచనను తన స్వార్ధానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వ్యక్తి.
అతడిని చూడగానే ఖాసిం ఎదురు వెళ్ళాడు. ఖాసిం, హుస్సేన్, మిగితా వ్యక్తులు ఓ గదిలో సమావేశమయ్యారు.

***********************

"ఖాసిం అంతా మనం అనుకున్తున్నట్టే జరుగుతుంది కదా..." హుస్సేన్ అడిగాడు.

"మీకే మాత్రం అనుమానం అక్కర్లేదు...మన మనుష్యులు సిద్ధంగా వున్నారు. కొన్ని గంటల్లో ఈ పుణ్యక్షేత్రం రక్తసిక్తమవుతుంది. రక్తం ఏరులై పారుతుంది. తిరుపతికి చాలా దూరంలో వున్నాం...ఈ అడవి లాంటి ప్రాంతానికి ఎవరూ రారు..." ఖాసిం చెప్పాడు.

"ఆ కార్తికేయ పులి లాంటి వాడు. ఏ క్షణమైనా దూకుతాడు...హైదరాబాద్ కు చెందిన సిట్ ఆఫీసర్ మరో వైపు ఇక్కడ మకాం వేసాడు. మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మన తలలు ఇండియా బోర్డర్ దాటి వెళ్ళవు...ఈ ఇండియన్స్ చాలా డేంజర్ ..."హుస్సేన్ చెప్పాడు.

"మన వాళ్ళు చాలా జాగ్రత్తగా వున్నారు..."

"మోహన పరిస్థితి ఏమిటి? హుస్సేన్ అడిగాడు.

ఆమె కార్తికేయ కస్టడీలో వుంది. తను సేఫ్ గా వుండాలని అక్కడ వుంది. పూర్ మోహన...మనం తన పని చేసిపెడతామని నమ్ముతుంది. ప్రబుత్వం దృష్టిలో మోహనే ఇదంతా చేస్తుంది. ముగ్ధను కిడ్నాప్ చేయించడం,ప్ లాస్టిక్ సర్జరీ చేయించడం...దేశంలో విధ్వంసం సృష్టించే కుట్రకు సంబంధించిన ప్లాన్ తాలుకూ వీడియో...అన్నీ నా దగ్గర భద్రంగా వున్నాయి...వీటి తాలూకు కాపీ నిఘా వర్గాలకు పంపించాను. అనుమానం మోహన మీదికి వెళ్తుంది. మనం పని ఫినిష్ చేస్తాం..ఈ దేశం మరో సారి స్వాంతంత్ర్యం కోల్పోతుంది..ఈ సారి శాశ్వతంగా..." క్రూరంగా నవ్వి చెప్పాడు ఖాసిం.

"మోహనను తక్కువ అంచనా వేయకూడదు ...ఇప్పటి వరకూ మోహనలోని ఆవేశాన్ని మనం రెచ్చగొడుతూ వచ్చాం...మొహనకు మన మీద అనుమానం వస్తే కష్టం..." చెప్పి లేచాడు హుస్సేన్.

ఖాసిం నల్ల రంగు పాతకాలం నాటి అంబాసిడర్ కారులో బయలుదేరాడు. జీపులో ఆ ఎనిమిది మంది బయల్దేరారు. ఇక అక్కడ వున్న వంద మంది ఆత్మాహుతి దళం విధ్వంస్న్ సృష్టించడానికి సిద్ధంగా వుంది.

ఆ ఎనిమిది మందిలో ఒకతను తన చేతికి వున్న వాచీ బటన్ ప్రెస్ చేసాడు. అప్పటి వరకూ అక్కడ జరిగిన సంభాషణ అవతలి వ్యక్తికి చేరిపోయింది.

ఆ వ్యక్తి...?

****************************

ఆ అడవి లాంటి ప్రాంతం లో గుర్రం రెక్కల చప్పుడు యముని మహిషపు లోహ గంటల వలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ గుర్రం మీద వున్న ముసుగు వ్యక్తి చేతిలో పొడవాటి పదును తేలిన ఖడ్గం ....గుర్రం వేగానికి దుమ్ము రేగిపోతోంది...ఎదురు వస్తోన్న జీపుకు గుర్రం అడ్డంగా నిలిచింది. సడెన్ బ్రేక్ తో జీపు ఆగింది.

జీపులోని వ్యక్తులు ఊహించని పరిణామం...ఆయుధాలు తీసుకునేలోపు గుర్రం మీద వున్న ముసుగు వ్యక్తి చేతిలోని ఖడ్గం ఇదరి తలలను వేరు చేసింది. వాళ్ళు ఆ షాక్ లో నుంచి తేరుకునేలోగా మరో రెండు మృతదేహాలు అ అడవిలో పడిపోయాయి...ఏకే 47 నిప్పులు కక్కే లోగా మొగితా ముగ్గురు హత మయ్యారు...రెప్ప పాటు కాలంలో రెచ్చిపోయిన ముసుగువ్యక్తి చేతి కరవాలానికి ఏడు తలలు నేల రాలాయి.

మోహన లోని ఆవేశాన్ని తన స్వార్ధానికి, దేశ వినాశనానికి ఉపయోగించుకోవాలని చూసిన హుస్సేన్ తల ముసుగు వ్యక్తి పాదాల దగ్గర పడింది.

ఎనిమిదో వ్యక్తి ముసుగు వ్యక్తి ముందు నిల బడ్డాడు.

"మిత్రమా...నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు...నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకునే అవకాశం ఇచ్చావు..ఈ డబ్బుతో ఎక్కడైనా స్థిరపడు...నీ వాళ్ళతో సుఖంగా జీవించు" గుర్రానికి కట్టి వున్న డబ్బు మూటని అతనికి అందించి...నెత్తుటితో తడిసిన కరవాలాన్ని ఓ సారి చూసుకుంది.ముసుగు తొలిగించి మోహన.

"మీరు ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నారు, అందుకే మీరు చెప్పగానే ఈ గ్యాంగ్ లో చేరి ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తూ వచ్చాను " ఎనిమిదో వ్యక్తి చెప్పాడు.

"నాకు సమయం లేదు మిత్రమా..మళ్ళీ కలుద్దాం..ఈ సారి మిమ్మల్ని ఓ మామూలు వ్యక్తి గా ఓ కుటుంబానికి పెద్దగా చూడాలి " అంటూ గుర్రాన్ని ముందుకు దూకించింది.

"తనకు ఎక్కువ సమయం లేదు..." ఆమె ఆలోచనలు అశ్వవేగాన్ని మించాయి.

No comments: