ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 20 April 2013

 Photo: ఒకే పిక్చర్ కి ఎన్ని రకాలగా రాయోచ్చో కదా.. ఈ రోజు ఒకరు ఒక మంచి అలరించే పిక్చర్ ని పెడితే, అది కాపీ కొట్టి దాని మీద అల్లిన ఈ ట్విన్స్ చూడండి,  ఒకోటి  ఒకోటి  ఒకానొక మనాసిక పరిస్థితిలో రాసినట్లుగా ఒకోలా అన్నట్టుగా వున్నాయి.. చూడండి. కాస్త మీ అభిప్రాయం చెప్పరూ

ముచ్చటైన నీ పరువాల పయ్యెద నా పాలఎదను మురిపెముగా దోచేలే చెలి
నాభిక్రింద కట్టబడిన నీ జలతారు బట్టకట్టు దాచిన అందాలు కవ్వించిలే చెలి
విసురజ

చేతిలో వీణతో చురుకైన చూపుతో అదిలించేవు నన్ను కదిలించేవు సఖీ
పాద మంజీరాలతో ముంజేతి కంకణాలతో అప్సరసల్లే నిలిచి నిలువరించావు సఖీ
విసురజ

గవాక్షం ఆవల విరిసే పున్నమి మెరిసే ప్రకృతి రమణీయత
కిటికీ ఈవల కాంతి కుమారి వీణతో మీటుతూ రసరాగమాలిక
విసురజ

నిలువరించే నీ అందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
నెమ్మదిలేని నా చిత్తం నిన్ను చేరికూడమని చప్పుడు చేస్తోంది

No comments: