ఆగష్టు1...(టాగ్ లైను.............డేట్ తో డిష్యుం...డిష్యుం)
27-04-2013 (17th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******
ఒక నమ్మకం కళ్ళ ముందే సుడిగాలిలో కొట్టుకుపోయినట్టు....ఒక వాస్తవం కళ్ళ ముందు చిమ్మచీకట్లను సృష్టించినట్టు...తన భర్త పర్స్ ...ఆ పర్స్ లో ఫోటో ...తను తన భర్త...మధ్యలో తమ మధ్య ఊపిరి పోసుకున్న అనురాగం...ఇప్పుడది...అనుమానం అయిందా? ఇదే నిజం...గతమంతా అబద్ధం అని చెప్పిందా?
ఏడవడానికి కన్నీళ్లు ఎక్కడున్నాయి? భర్త ప్రేమలో, ఇన్నాళ్ళు భర్త అందించిన సంతోషంలో తనే కన్నీటిని గెంటి వేసింది..నీ అవసరం నాకు లేదు...నా భర్త ఉన్నంతవరకూ గెట్ లాస్ట్...అంది.
ఇప్పుడా కన్నీళ్లు తను పిలిచినా రావు. రాని కన్నీళ్ళ కోసం ఎందుకు ఎదురుచూడడం?
ఒక నమ్మలేని నిజం కళ్ళెదురుగా
భౌతిక
రూపంలో కనిపిస్తే. ఆ నిజాన్ని జీర్ణించుకోవడం కష్టం....అదీ మనసైన వాడి విషయంలో ....రాధాచంద్రిక పరిస్థితి అలానే వుంది. ఇక అక్కడ వుండడం శ్రేయస్కరం కాదు. తనను ఎవరైనా గమనిస్తున్నారా? లేదా? అన్న విషయం పట్టించుకోలేదు.
అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది. వచ్చే ముందు భర్త పర్స్ తీసుకు వచ్చింది.
=============
మనసు సంతోషంగా వునప్పుడు గడియారంలోని క్షణాల ముల్లు అతి వేగంగా కదులుతుంది. కాలం చేతిలో నుంచి జారిపోయినట్టు...పరుగు పందెంలో ముందున్నట్టు అనిపిస్తుంది.
మనసు వేదనాభరితం అయినప్పుడు, ఆందోళన మన వెంట వున్నప్పుడు క్షణాలు భారంగా, బద్దకంగా కదులుతాయి.
రాధాచంద్రిక సోఫాలో కూచుంది. మంచం మీద బోర్లా పడుకుంది. బాల్కనీలో పచార్లు చేసింది. భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. ఎలా మొదలు పెట్టాలి..ఏమని అడగాలి? భర్త ఇంటికి వస్తాడా? పోలీసులు అరెస్ట్ చేసారా? తన భర్త శరీరాన్ని, మనసును మరో స్త్రీ పంచుకుందన్న విషయాన్ని తట్టుకోలేకపోతుంది. తనే ప్రపంచంగా బ్రతికే భర్తలోని మరో కోణం ఊహించలేకపోతుంది. ఇది అబద్దం అయితే బావుండు. రాత్రి నిద్రలో వచ్చిన పీడ కల అయితే మరీ బావుండు.
మధ్యాహ్నం దాటింది...సాయంకాలం అయింది. రాత్రి కావస్తోంది. ఇంకా భర్త ఫోన్ స్విచాఫ్ లోనే వుంది.
పారిపోయాడా?
తల పట్టుకుంది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు టీవీ ఆన్ చేసింది. హత్య, అక్రమ సంబంధాలు లాంటి వార్తలు టీవీ చానెల్స్ కు ప్రాణం. వాళ్ళ రేటింగ్ కి ఇవే ఆక్సిజన్. ఖచ్చితంగా ఈ వార్త మీడియాకు చేరి వుంటుంది.పదే పదే చూపిస్తూ వుంటారు...కానీ టీవీలో వార్త రాలేదు. హెల్ ...నరకం ఇక్కడే వుంటుంది. మన మనసులో, మన ఆలోచనలలో, మనం ఓడిపోయామన్న నిర్లిప్తతతలో....
అంతా కన్ఫ్యూజన్ గా వుంది.
===============
పెళ్ళయిన తర్వాత మొదటి సారి భర్త ప్రేసేన్సుని మిస్సయింది. సాయంత్రం అయిదు దాటిందంటే "ఆన్ ది వే.." అన్న మెసేజ్ లు వచ్చేవి. ఆరు లోపు ఇంట్లో ఉండేవాడు...ఎప్పుడూ ఫోన్ లో టచ్ లోనే వుండే వ్యక్తి...
భర్త హత్య కేసులో జైలుకు వెళ్తాడని బాధ పడాలా? భర్త జీవితంలో మరో స్త్రీ వుందని కన్నీళ్లు పెట్టాలా? భర్త ప్రేమ నటన అని వేదన చెందాలా?
(నిజం గా ఇలాంటి పరిస్థితి వస్తే...ఏ భార్య అయినా ఏం చేస్తుంది? ఒక రచయితగా నా ఊహకు కూడా అందని విషాద స్థితి...ఒక వేళ మీరు ఊహించగాలిగితే...మీ ఊహ, ఆలోచన తెలియజేయండి ...మీరే రాధాచంద్రిక అయితే...ఏం చేస్తారో, ఎట్లా స్పందన వుంటుందో ఆవిధముగా స్పందించి, నా అక్షర ప్రస్థానానికి ఓ చిరుమజిలీ అందించండి---రచయిత)
===========
అర్ధరాత్రి పన్నెండు దాటుతుండగా వచ్చాడు భర్త. మొహం అలిసిపోయి వుంది, నీరసించి వుంది. రోజూ రాగానే తనే ఎదురు వెళ్ళేది. ముందుగా గట్టిగా వాటేసుకునేది. ఉదయం నుంచి సాయంకాలం వరకూ మిస్సయిన మిస్సింగ్ కు కాంపన్సేషన్ ఆ కౌగిలి అన్న ఫీలింగ్ ఆమెది. కానీ ఆ రోజు అలా చేయలేదు...అదేమిటని అతను అడగనూ లేదు. మౌనంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఉదయం నుంచి ఏమీ వండలేదు. ఫ్రిజ్ లో నుంచి జ్యూస్ తీసి టేబుల్ మీద పెట్టింది. తనకూ ఆకలి అవుతుంది. అయినా తినే మూడ్ లేదు..తినగలిగిన పరిస్థితీ లేదు.
బాత్ రూంలోకి వెళ్ళిన భర్త హాల్ లోకి రాలేదు. ఆశ్చర్యం గా బెడ్ రూం లోకి వెళ్ళింది. అటు తిరిగి పడుకున్నాడు. తన అనుమానం నిజమే? తనను పలకరించకుండా అటు తిరిగి పడుకున భర్తను ఇంకేమడుగుతుంది? చెప్పకనే చెప్పినట్టు...తన తప్పు ఒప్పుకున్నట్టు కనపడుతూ వుంటే...భర్త పక్కన పడుకోవాలని కూడా అనిపించలేదు. హాల్ లోకి వచ్చి సోఫాలో పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు.
ఇప్పడు తనేం చేయాలి?
ఈ ప్రశ్న తను ఉదయం నుంచి వంద సార్లు వేసుకుంది.
అర్ధరాత్రి పన్నెండు దాటుతుండగా భర్త లేచి లాన్ లోకి నడిచాడు. కంటి చివరల నుంచి గమనిస్తూనే వుంది. అప్పుడే బెడ్ రూంలోని ల్యాండ్ ఫోన్ మోగింది. వెంటనే బెడ్ రూంలోకి వెళ్లి రిసీవర్ లిఫ్ట్ చేసింది.
"సారీ ఫ్రెండ్ ఈ టైంలో డిస్ట్రబ్ చేశాను..కానీ తప్పదు..నీ భర్త ...అదే నీ దేవుడు శవాన్ని మాయం చేసాడు...తెలుసా?" అపరిచిత గొంతు...
రాధాచంద్రిక అలానే ఉండిపోయింది. భర్తని చూస్తేనే భయమేస్తుంది. నిన్నటి వరకూ, తన భయాలను, విషాదాలను, వేదనలు పారద్రోలే వ్యక్తి ఇప్పుడు ఒక హంతకుడు. అడుగుల శబ్దం..తనని కూడా చంపుతాడా?
================
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)

No comments:
Post a Comment