ఆగష్టు1(టాగ్ లైను...డేట్ తో డిష్యుం...డిష్యుం)
08-05-2013 (28th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
నాంపల్లి ఓ సారి ధాబా మొత్తం కలియతిరిగాడు. అతను డ్రైవర్ కాబట్టి వృత్తి
రీత్యా ఎన్నో ఊళ్ళు తిరిగాడు. అతనికి అద్భుతం అనే పదం మీద నమ్మకం ఎక్కువ.
తన జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందన్న నమ్మకం అతనిది. నాంపల్లి ప్రణవిని
సమీపిస్తుండగా క్లీనర్ పిలిచాడు. తల వెనక్కి తిప్పి ఏమిటన్నట్టు చూసాడు
నాంపల్లి. "ఫోటో వద్దా? అని అడిగాడు, అక్కడి నుంచే క్లీనర్. అప్పటికే
అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణవి. కొద్దిలో మిస్సయింది .
************
సంధ్యాజ్యోతి ఆఫీసుకు వెళ్లేసరికి చీఫ్ ఎడిటర్ తన ఛాంబర్ లో వున్నాడు.
సత్య దగ్గరికి వెళ్లి బాస్ దేవుడు వచ్చి ఎంత సేపయింది? అని అడిగింది.
"బాస్ దేవుడు ఏమిటి? కొత్త పేరు...' సత్య ఆశ్చర్యపోతూ అడిగింది.
"నాకు వుద్యోగం ఇచ్చి, కాన్ఫిడెన్స్ ని ఇచ్చిన దేవుడులాంటి బాస్ కాబట్టి బాస్ దేవుడు అన్నాను." క్లారిఫికేషన్ ఇచ్చింది.
"నువ్వు నాకు అర్థం కావు... బాస్ నీ గురించి అడిగాడు" చెప్పింది సత్య.
"అడిగాడూ...నాకు తెలుసు నేను లేకపోతే సర్ కు తోచదు." ఉత్సాహంగా అంది సంధ్య.
"అదేమీ కాదు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన విసురజ గారి మూడు పుస్తకాల ఆవిష్కరణకు సంబంధించిన స్పెషల్ స్టోరీ రాయాలిట..."
"ఆఫ్ కోర్స్ ఇలాంటివి నేనే రాయగలనని బాస్ బలమైన ఫీలింగ్...బహుశా విసురజ
గారు కూడా నన్నే రికమండ్ చేసివుంటారు" అంటూ ఎడిటర్ చాంబర్ వైపు నడిచింది.
శర్మ గుర్రుగా చూస్తున్నాడు.
****************
మెల్లిగా, పిల్లిలా ఛాంబర్ లోకి అడుగు పెట్టింది సంధ్యాజ్యోతి. ఎడిటర్ తలెత్తకుండానే అడిగాడు "వెళ్ళిన పని పూర్తయిందా?
ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత క్షణం కూడా అర్థం కాలేదు. వంటనే నోటికొచ్చింది చెప్పింది.
"మా ఫ్రెండ్ కజిన్ బాబాయికి యాక్సిడెంట్ అయింది సర్...రక్తం ఇచ్చి వస్తున్నాను ...అందుకే లేటయింది" బుద్ధిగా చెప్పింది.
"మీ ఫ్రెండ్ చేతబడులు చేస్తాడా? అడిగాడు ఎడిటర్.
"ఫినిష్...తన పని అయిపొయింది...అయినా తను చేసే ప్రతీ పని ఎలా తెలుస్తుంది? ఆలోచనలో పడి పోయింది."
ఎడిటర్ టేబుల్ మీద ఏదో వెతుకుతున్నాడు "కొంపదీసి తనను కొట్టడానికి ఏ
బెల్ట్ కోసమైనా వెతుకుతున్నాడా? బెల్ కొట్టి బాయ్ ని పిలిచి కొరడా
కొనుక్కురమ్మని చెబుతాడా?
సంధ్య ఆలోచిస్తూ ఉండగానే ఎడిటర్ టేబుల్ మీద వున్న మొబైల్ తీసి ఇచ్చాడు.
"అరె...అచ్చం నా మొబైల్ లానే వుంది..' ఆ మొబైల్ చేతిలోకి తీసుకుని అంది.
"అవును...మీ ఫ్రెండ్ బాబాయి కజిన్ కి రక్తదానం చేస్తుంటే మొబైల్ జారి కింద
పడింది. చూసి ఓ క్యాబ్ డ్రైవర్ తెచ్చి ఇచ్చాడు" చెప్పాడు ఎడిటర్.
సంధ్యకు సీన్ అర్థమైంది. "సర్ ఇప్పుడు తిడతారా? మెల్లిగా అడిగింది. ఎడిటర్ కు నవ్వొచ్చింది.
వెంటనే తన చేతిలో వున్న పేపర్స్ తీసుకుని సంధ్య చేతికి ఇచ్చాడు.
"రాజమండ్రిలో జరిగిన పుస్తకావిష్కరణ మేటర్ ...దీన్ని స్పెషల్ స్టోరీ గా రాయాలి." చెప్పాడు.
"మీతో పాటు నన్ను తీసుకువెళ్తే నేనూ 'విసురజ'ను ఇంటర్ వ్యూ చేసేదాన్ని" తనలో తనే గొణుకుంది.
"నిన్నరాత్రి రెండు లోకల్ చానెల్స్ వాళ్ళు ఇంటర్ వ్యూ చేసారు. వాటి లింక్
కనుక్కోండి. ఈ పుస్తకావిష్కరణ సక్సెస్ ఫుల్ గా జరగడానికి కారణమైన
వారికి,థాంక్స్ చెప్పండి, స్టోరీ తయారయ్యాక నాకు చూపించండి" చెప్పి ఇక
వెళ్ళొచ్చు అన్నట్టు చూసాడు.
***********
పుస్తకావిష్కరణ న్యూస్ చూసింది. సోమవారం రోజే వచ్చింది. మెయిల్ చెక్
చేసింది. పుస్తకావిష్కరణ ఫొటోస్...వెంటనే విసురజను చూసింది. ఒక్క క్షణం
అతను రాసిన ముగ్ధమోహనంలో కార్తికేయ గుర్తొచ్చాడు. ఓహ్...గ్లామర్ రచయిత అన్న
మాట...అనుకుంది. అటు ఇటు చూసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని, ఫంక్షన్ లో
విసురజ మాట్లాడిన స్పీచ్ వింది. అతని అక్షరాలలా మాటలు కూడా బావున్నాయి.
స్పెషల్ స్టోరీ టైపు చేస్తోంది. అదే సమయంలో క్షుద్రమాంత్రికుడు..,క్షుద్ర పూజలో కూచున్నాడు.
చంద్రహాస్ వైజాగ్ లో అడుగు పెట్టాడు..
ప్రణవి బొంబాయి వెళ్ళే రైలు ఎక్కింది. సుకన్య రాధాచంద్రిక ఇంటి ముందుకు వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేసింది.
**********
(మిస్టీరియస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పాత్రలు...రేపటి వరకూ వెయిట్ చేయక తప్పదు)
No comments:
Post a Comment