ఆగష్టు1(టాగ్ లైను..డేట్ తో డిష్యుం...డిష్యుం)
30-04-2013
(20th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
****
ఒక చిన్నపాటి కలవరం రాధాచంద్రికలో...
"మీరు తప్పు చేసారా? హత్య చేసారా? కళ్ళ ముందు గెస్ట్ హౌస్ దృశ్యం కనిపించి భయంగా అడిగింది.
ఆమె వెనక్కి తీసుకున్న చేతులను తన భుజం మీద వేసుకుంటూ "అవును, నీ మనశ్శాంతిని నీకు దూరం చేసి తప్పు చేసాను...నీ నమ్మకాన్ని హత్య చేసాను, నీ స్పర్శను నాకు నేను దూరం చేసుకున్నాను. పర్స్ పోయిన క్షణం నుంచి నేను మనిషిలా లేను...నా పర్స్ పోయింది. అందుకు నేను బాధ పడడం లేదు రాధీ...కాకపోతే అందులో నీ ఫోటో వుంది. ఇష్టంగా నేను తీసిన ఫోటో...పోలీసు స్టేషన్ లో కూడా కంప్లయింట్ చేసాను. ఏదైనా ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీని కలిసి పర్స్ వెతికే పని అప్పగించాలని చూస్తున్నాను. రెండు రోజులుగా పర్స్ కోసం వెతకని చోటు లేదు. పర్స్ ని, నీ స్పర్శని ఐ మిస్డ్ డియర్ " ఆమె గుండెల మధ్య తల పెట్టి అన్నాడు.
ఒక్క క్షణం ఆమె మనసు ఆర్ద్రమైంది. "మరీ ఇంత సేన్స్తిటివ్ అయితే ఎలా చెప్పండి. ఆఫ్ట్రాల్ ఫోటో..మనిషిని మీ ఎదురుగానే వున్నానుగా" అతని తల మీద చేయి వేసి అంది.
"అది నీకు ఆఫ్ట్రాల్....కానీ రాధీ నాకు ఆఫ్ట్రాల్ కాదు...ఒంట్లో కొలెస్ట్రాల్ లేకున్నా బ్రతగ్గలను కానీ ఈ రాధీ లేకపోతే నేను బ్రతకలేను. " అంటూ ఆమెను చుట్టేసాడు.
"ఛ..ఛ..యిలాంటి మనిషినా తను అనుమానించింది? తనని తానే తిట్టుకుంది.
"పర్స్ విషయం భర్తకు చెప్పకూడదు. చెబితే అసలు విషయం బయటకు వస్తుంది. ఇప్పటికీ అర్ధం కానీ విషయం ..తన భర్త పర్స్ గెస్ట్ హౌస్కు ఎలా వెళ్ళింది?
ఆ రాత్రి అంతా అతను ఆమెను నిద్రపోనివ్వలేదు అల్లరితో. ఆమె నిద్రపోలేదు ఆలోచనలతో.
=========
భర్త ఆఫీసుకు వెళ్ళాడు. రాధాచంద్రికలో ఇంకా కన్ఫ్యూజన్ పోలేదు. ఇప్పుడు ఆమె ముందు రెండు సమస్యలు వున్నాయి. "ఒకటి తన భర్త పర్స్ ఎలాగైనా భర్తకు చేరేలా చూడాలి ...ఎలా? ఆ పర్స్ దొరక్కపోతే భర్త పిచ్చివాడైపోయేలా వున్నాడు...మరోటి..ఈ పర్స్ గెస్ట్ హౌస్ కు ఎలా వెళ్ళింది? అక్కడ హత్య చేయబడిన స్త్రీ ఎవరు?
ఆమె రెండో సమస్యకు సమాధానం సమస్య రూపంలో తెలిసింది. రాధాచంద్రిక ఆలోచిస్తూ వుండగా ల్యాండ్ ఫోన్ మోగింది. వెంటనే బెడ్ రూంలోకి పరిగెత్తి రిసీవర్ లిఫ్ట్ చేసింది.
"హలో..." అటు వైపు నుంచి అదే గొంతు.
"హలో ..మీరెవరు? మీకేం కావాలి? ఈ టార్చర్ ఏమిటి? కోపంగా అడిగింది రాధాచంద్రిక.
"మీకెప్పుడైనా మీ భార్యను చంపాలని అనిపించిందా? ఇది రామ్ గోపాల్ వర్మ పిక్చర్ ...మీకెప్పుడైన మీ భర్త హత్య చేసిన అమ్మాయి డెడ్ బాడీని చూడాలని ఉందా? ఇది కొత్త టైటిల్ ....అయినా కళ్ళార హత్య చూసి కంగారు నటిస్తారేమిటి మేడం? అవతలి వైపు నుంచి వినిపించింది.
"అబద్దం..అంతా అబద్దం...నా భర్త ఎవరినీ చంపలేదు" గట్టిగా అరిచింది రాధాచంద్రిక.
"మరి...శవం దగ్గర దొరికిన మీ వారి పర్స్ ..?
"మా వారి పర్స్ పోయింది.పోలీసు స్టేషన్ లో కూడా కంప్లయింట్ ఇచ్చారు" అంది రాధాచంద్రిక.
ఒక్క క్షణం అటువైపు సైలెంట్..రాధాచంద్రికకు అర్ధమవుతుంది." అవతలి వ్యక్తి అబద్దం ఆడుతున్నాడని...తన భర్త నిర్దోషి అని..."
"అంతా తెలిసిపోయింది అన్నమాట..." అటు వైపు నుంచి గొణుక్కోవడం వినిపిస్తోంది.
వెంటనే లైన్ కట్ అయింది. అక్కడితో అయిపొయింది అనుకుంది. కానీ ఇంకా వుందని ఆలస్యంగా తెలిసింది.
++++++++++++++
డోర్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే నిన్న వచ్చిన పోలీసులు.
"మేడం సర్ కు చెప్పలేదా " అడిగారు. వాళ్ళని చూడగానే ఓ ఆలోచన వచ్చింది. భర్తను సంతోషపెట్టడానికి, ఈ సమస్య నుంచి బయటపడడానికి...
వెంటనే లోపలి వెళ్లి పర్స్ తీసుకువచ్చి పోలీసుల చేతికి ఇచ్చి "నిన్న రాత్రి ఎవరో గుమ్మం దగర పెట్టి వెళ్లారు. బహుశా మీకు భయపడి ఆ పని చేసి వుంటారు. ఈ పర్స్ మీరే వెతికి పట్టుకున్నట్టు సర్ తో చెప్పండి.మంచి గిఫ్ట్ ఇస్తారు.." చెప్పింది రాధాచంద్రిక. వాళ్ళ మొహంలో వెలుగు.
"థాంక్స్ మేడం .." సంతోషంగా పర్స్, ఆ పర్స్ తో పాటు రాధాచంద్రిక ఇచ్చిన రెండు వేయిరూపాయల నోట్లు తీసుకుని వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిన కాసేపటికి భర్త ఆఫీసు నుంచి ఫోన్ చేసాడు. అతని గొంతులో ఎక్సయిట్ మెంట్ ." రాధీ, మన పర్స్ దొరికింది " హ్యాపీగా చెప్పాడు.
రాధాచంద్రిక భర్త ఆనందాన్ని ఎంజాయ్ చేస్తోంది.
అసలు కథ మొదలవ్వబోతుందని రాధాచంద్రికకు ఆ క్షణం తెలియదు.
(వాట్ నెక్స్ట్ ..రేపటి సంచికలో)

No comments:
Post a Comment