ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

ఆగష్టు1(టాగ్ లైను..డేట్ తో డిష్యుం...డిష్యుం)
07-05-2013 (27th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
రాధాచంద్రిక ఆవేశంతో రొప్పుతోంది. "అసలు మీకేం కావాలి...నన్ను ఎందుకిలా టార్చర్ చేస్తున్నారు...?"మరోసారి రెట్టించి అడిగింది.
"నిజం..నిజం కావాలి? తాపీగా అంది మగ గొంతుతో సుకన్య.
"ఏం నిజం? నా భర్త హత్య చేయలేదని ఆ రోజే చెప్పాను. నా భర్తను హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారు." రాధాచంద్రిక అంది.
ఉలిక్కిపడింది సుకన్య ...కథలో ఆమె ఊహించని కొత్త మలుపు....
"మరి ఆ హత్య ఎవరు చేసినట్టు? సుకన్య అంది.
"నాకెలా తెలుస్తుంది? అసలు హత్య జరిగిందో, లేదో కూడా తెలియదు."
"నన్ను గుర్తు పట్టావా? అడిగింది సుకన్య.
"ఎప్పుడూ ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేసే మిమ్మల్ని నేనెలా గుర్తు పడతాను."
"ఓహ్..వెరీ గుడ్" అంటూ ఫోన్ పెట్టేసింది.
************
ఒక్కో విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. అనుమానపు తెరలు తొలుగుతున్నాయి. ఒక నిశ్చయానికి వచ్చింది సుకన్య.
********************
చంద్రహాస్ వెంటనే తన కోటు జేబులో వున్న మొబైల్ తీసాడు. ఆ నంబర్ ఎవరికీ తెలియదు. ఆ నంబర్ నుంచి ఒకరికి ఫోన్ చేసాడు. "నా అనుమానం సగం నిజమైంది..మిగితా సగం నిజం కావాలి " చెప్పి ఫోన్ కట్ చేసాడు. అవతలి వ్యక్తి డాక్టర్ చతుర్వేది.
రోడ్డు మీదికి వచ్చింది ప్రణవి. కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్. తనకు ఆశ్రయం ఇచ్చిన వృద్దుడికి చెప్పకుండా వచ్చింది. "తనెవరో తెలుసుకోవాలి..తన పేరేమిటో తెలుసుకోవాలి ...అసలు తానేమిటో తెలుసుకోవాలి." ఆమె చేతిలో హ్యాండ్ బాగ్.
**********
చిన్నధాబా, హైవే నుంచి వచ్చే వెహికల్స్ అక్కడ ఆగుతున్నాయి. బయట నులక మంచాలు వేసున్నాయి. లారీలు, బళ్ళు అక్కడ ఆగుతున్నాయి. చాయ్ .సమోసా బిస్కట్స్ నుంచి నాన్ వెజ్ వరకూ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మంచం మీద దినపత్రికలు వున్నాయి. వాటిలో పాత పత్రికలూ వున్నాయి. డ్రైవర్స్ ఆ రూట్ లో వెళ్ళే బస్సు ప్రయాణీకులు అక్కడ ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
పని కుర్రాడు మంచాలు వేసి వెళ్తున్నాడు. పాత పేపర్స్ తీసేస్తున్నాడు. అలా అతను తీసేసిన పేపర్స్ లో ప్రణవి యాడ్ కు సంబంధించిన పేపర్ వుంది.
ప్రణవి ఆ ధాబా దగ్గరికి వచ్చింది. "అక్కడ ఎవరైనా తనని గుర్తు పడితే బావుండు" అనుకుంది.
ధాబాలో వున్న లారీ డ్రైవర్స్ ప్రణవి వంక విచిత్రంగా చూసారు.ఒంటరిగా ఎలా వచ్చింది? అన్న ఆలోచనలో వున్నారు.
*************
*************
నాంపల్లి కుడికాలు లారీని స్పీడ్ గా తీసుకువెళ్తుంది. అతని పక్కనే క్లీనర్ యాదగిరి వున్నాడు. ఆ లారీ హైదరాబాద్ వైపు వెళ్తుంది.
"అన్నా ఆకలి దంచేస్తుంది. రాత్రి సరిగ్గా ఫుడ్ లేదు. ఎక్కడైనా ధాబా వుంటే ఆపేయ్ గురూ..." అన్నాడు యాదగిరి. ఆ మాటలు విననట్టే వున్నాడు, నాంపల్లి అతని దృష్టి డాష్ బోర్డు లో వున్న పేపర్ మీద పడింది. మరో సారి ఆ పేపర్ తీసి చదువుకున్నాడు. ప్రణవికి సంబందంచిన యాడ్...
"తనగ్గానీ ఆ అమ్మాయి కనిపిస్తే తన జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది...ఇలా రాత్రుళ్ళు మనశ్శాంతి లేకుండా బ్రతకవలిసిన అవసరం ఉండదు.
మరో సారి డాష్ బోర్డు లో నుంచి ఆ పేపర్ తీసి చదువుకున్నాడు. ఫోటో లో వున్న అమ్మాయిని తను పట్టుకోగలిగితే...బ్రతికి ఉన్నంత వరకు కాలు మీద కాలు వేసుకుని బ్రతికేయవచ్చు. తను జీవితాంతం దర్జాగా బ్రతికే అవకాశం. ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండానే బ్రతకవచ్చు.
**************
ప్రణవి ధాబా దగ్గరికి వచ్చింది."తను ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? తలంతా బరువుగా అనిపించింది.
"తనెవరో తనకు తెలియక పోవడం ఎంత విషాదం? కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. సరిగా అప్పుడే నాంపల్లి లారీ అక్కడ ఆగింది. పేపర్ చేతిలోకి తీసుకుని కిందికి దిగాడు నాంపల్లి. ప్రణవి గురించి ఇతరులను అడగ దలచుకోలేదు. ఎందుకంటే అవతలి వాడికి హింట్ ఇచ్చినట్టు అవుతుందన్నది అతని ఫీలింగ్. అతను దిగి కౌంటర్ వైపు వస్తూ వుండడం...ప్రణవి అతనికి ఎదురు రావడం ఒకేసారి జరిగాయి.
*************
(ఆ తర్వాత ?రేపటి సంచికలో)

No comments: