ఆగష్టు1(టాగ్ లైను...డేట్ తో డిష్యుం...డిష్యుం)
06-05-2013 (26th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
డ్రైవర్ చెప్పడం ప్రారంభించాడు."కొన్నాళ్ళు పిచ్చివాడిగా అనిపించాడు.
స్మశానంలోనే అతని నివాసం. అటువైపు రాత్రుళ్ళే కాదు...పగలు వెళ్ళాలన్న భయం
వేసేది. ఓ రోజు కాటికాపరి బలవంతంగా అతడిని స్మశానం నుంచి గెంటి వేసాడు.
తెల్లవారి చూసేసరికి కాటికాపరి శవమై కనిపించాడు. క్షుద్రమాంత్రికుడు
కనిపించలేదు. కొన్నాళ్ళకు తెలిసింది. ఇక్కడ ఉన్నాడని. జనం ఇటువైపు రావడం
మానేశారు. రోజూ క్షుద్రపూజలు చేస్తాడని ప్రచారం. చేతబడులు చేస్తాడని కూడా
అంటారు. అయినా ఇతడితో మీకేమిటి పని మేడం...కొంపదీసి? అని ఆగాడు.
"చేతబడి చేయిద్దామని...ఆడపిల్లల మీద అత్యాచారం చేసే మ్రుగాళ్ళ మీద చేతబడి చేయిద్దామని.." సంధ్య అంది.
సరదాగా అన్న ఆ మాట అతడిని ఆలోచింపజేసింది.
************
చంద్రహాస్ క్షణంలో పదో వంతులో ప్రమాదం ఊహించాడు. ఆ ప్రమాదం ప్లాన్ అన్న
అనుమానం వచ్చింది. ఆతను డ్రైవింగ్ లో నిష్ణాతుడు. వంటనే కారుని పక్కకు కట్
చేసాడు చాలా ఒడుపుగా...మరొకరు ఆ పరిస్థితిలో ఉన్నట్టయితే యాక్సిడెంట్
అనివార్యమయ్యేది. కారు నుజ్జు నుజ్జయి పోయేది. శవం ఆనవాళ్ళు పట్టకుండా
మారిపోయేది.
లారీ డ్రైవర్ ఏ మాత్రం ఊహించని సంఘటన ఇది. శత్రువుని
అందులోనూ చంద్రహాస్ లాంటి వ్యక్తిని తక్కువగా అంచనా వేసాడు. లారీ అదుపు
తప్పింది ..పెద్ద శబ్దం...ప్రమాదం అంచులో నుంచి వెంట్రుకవాసి దూరంలో
తప్పించుకున్నాడు.
*****************
సుకన్య చాలా ఓపిగ్గా వెయిట్ చేస్తుంది. రాధాచంద్రిక భర్త వెళ్ళే వరకూ
వెయిట్ చేసింది. కొన్ని గంటల క్రితమే ఆమెకు ఓ న్యూస్ తెలిసింది.
రాధాచంద్రికకు వచ్చి వెళ్ళిన కాల్స్ ట్రేస్ చేస్తే రాధాచంద్రిక ల్యాండ్
ఫోన్ కు
వచ్చిన కాల్స్ ఆమెకు ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి వచ్చాయి.
వెంటనే అక్కడికి వెళ్తే ఆ టెలిఫోన్ కాల్స్ చేసిన వ్యక్తి పోలికలు ఎంక్వయిరీ
చేయిస్తే...ఆ పోలికలు రాధాచంద్రిక భర్త పోలికలతో సరిపోయాయి.
భార్యకు
బయటనుంచి ఫోన్ చేయవలిసిన అవసరం ఏమిటి? ఈ మిస్టరీ విడిపోవాలంటే తను డైరెక్ట్
గా రాధతోనే మాట్లాడాలి. అందుకే ఆమె భర్త వెళ్ళే వరకూ ఆగింది. ఆమె భర్త
వెళ్ళాక రాధాచంద్రిక ఇంటి ముందుకు వెళ్లి డోర్ బెల్ ప్రెస్ చేయబోయి ఆగింది.
చిన్న అనుమానం...ఇప్పుడు తను ఆ ఫోన్ కాల్ గురించి అడిగితే సమాధానం
చెబుతుందా? తను వచ్చి ఎంక్వయిరీ చేసిన సంగతి భర్తతో చెబితే..తన పరిశోధన
ముందుకు వెళ్ళడం కష్టం. క్షణాల్లో తన నిర్ణయం మార్చుకుంది. ఆమె బ్రెయిన్
ఎప్పుడూ షార్ప్ గా పని చేస్తుంది. పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళింది.
వృత్తిలో భాగంగా ఆమె మిమిక్రీ నేర్చుకుంది. ఢిల్లీలో వుండగా విద్యారణ్య అనే
పాపులర్ మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకున్న మిమిక్రీని ఇపుడు ఒక మంచి
పని కోసం వాడుతుంది.
రాధాచంద్రిక ల్యాండ్ ఫోన్ నంబర్ ని గుర్తు
చేసుకుని నంబర్ డయల్ చేసింది. ఒకటి...రెండు...మూడు...అటు వైపు నుంచి
రిసీవర్ లిఫ్ట్ చేసిన శబ్దం.
******************
రాధాచంద్రిక అనీజీగా వుంది. ఒక సమస్య పోయింది అనుకుంటే మరో సమస్య. బ్లాక్ మేయిలట్ టార్చర్ భరించలేకపోతుంది .
సరిగ్గా అప్పుడే ల్యాండ్ ఫోన్ మోగింది. ఈ సారి తేల్చుకోవాలి...అసలు సంగతి
తేల్చేయాలి అనుకుంది. రిసీవర్ లిఫ్ట్ చేస్తూనే బరష్టయింది ..
"అసలు మీకేం కావాలి? నన్నెందుకిలా టార్చర్ చేస్తున్నారు?" కోపంగా అడిగింది.
అవతలి వైపు నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం.
****************
(ఆ తర్వాత...ఏం జరిగింది రేపటి సంచికలో)
No comments:
Post a Comment