ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

నింగిలోని తారాడే ఎరుపుని చూశా ... నీలో
నిశిరేయి గగనాన చంద్రమ్మను చూశా ... నీలో
నేలపైన నడిచే నెలవంకను చూశా.. నీలో
తీరైన మోములో తీరనితమకాలు చూశా..నీలో
అద్దాల బుగ్గల్లో మెరుపుని చూశా... నీలో
మత్తెక్కించే కళ్ళల్లో మైమెరుపుని చూశా..నీలో
అదిరే అధరాలలో అమృతకలశం చూశా..నీలో
బాహూవాగ్నిలో రాజిల్లే బాహువులనిప్పును చూశా..నీలో
ప్రేమించే గుండెలలో గమ్మత్తైనగోల చూశా...నీలో
వయ్యారి నడుములో సొంపులసంతకం చూశా...నీలో
చకచకనడిచే పొడుగుకాళ్ళ పొగరును చూశా...నీలో
పదకవితలు పలికించే పాదములందాలు చూశా..నీలో
మొత్తానికి మొదటి చూపుతోనే పడగొట్టే ప్రభలను చూశా... నీలో
జీవితాల్ని వెలిగించే ప్రభలమైన వన్నెచిన్నెల సొబగును చూశా..నీలో
ఎవరు నీవు ఎదుటపడి మనసు దోచినావు
మదిలోగిలిలో కొలువుండినావు వివరం తెలపవా నీవు
జతకూడగ రావా మునుపెరుగని తీయని బాధ పంచినావు
నాదు మానసము ప్రాణము జీవితమిక ప్రాణమైన చెలికిచ్చినాను

No comments: