ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 25 June 2013

1) అత్యంత ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగించుకోనివ్వాలని అందరు ఆశపడతారు కానీ ఆశానిపాతంలోలా మధ్యలో ఇబ్బందులు, అరిష్టాలు ఇత్యాది తాకుతూనే వుంటాయి, అటువంటి సమయంలో కూడా చెదరని చిరునవ్వుతో మొక్కవోని ధైర్యముతో ముందుకు సాగేవాడే ధీరుడు అని ప్రజలచే కొనియాడబడతాడు
2) జీవిత యాత్రలో ప్రయాణం చేస్తూ బ్రతుకుకు సంబంధించి సరైనా విధాన నిర్ణయం తీసుకోవాలని ఆగితే సమయం వ్యయం తప్ప మరేమీ కాదు. అవసరాన్ని, ఆలోచనని బట్టి ఒక నిర్ణయం తీసుకుని దానిని సరైనదిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసి సఫలం చెందాలి
(P.S.. ఈ జగంలో డబ్బు కంటే విజ్ఞ్యానధనమే ఎక్కువ వడ్డీని, మంచి మిత్రులను సంపాదించి పెడుతుంది)

No comments: