ఆగష్టు1...డేట్ తో డిష్యుం...డిష్యుం
13-06-2013 (chapter-64)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
(ఆగష్టు 1 లో హీరో ఎవరు ? ఈ కథాంశం దీరోదాత్తత ప్రధానంగా కొనసాగిందా ?
రచయిత ఈసీరియల్ లో చేసిన ప్రయోగం ఏమిటి ? విసురజ మనసులో మాట...సీరియల్
ముగింపులో...డోంట్ మిస్ ---చీఫ్ ఎడిటర్ )
జీవితం ఒక యుద్ధం...నిరంతరం
పోరాడుతూనే వుండాలి.ఓడి పోవడమంటే గెలువగలిగి వుండి యుద్ధాన్ని మధ్యలో
ఆపివేయడం...యోధుడి చివరిక్షణం కూడా పోరాటంలోనే కొనసాగాలి. మృత్యువు తన
ముందు వుందని తెలిసినప్పుడు "నిస్సహాయంగా తలవంచడం కాకుండా,చివరిక్షణం వరకు
పోరాడుతూనే ఉండాలన్న జీవిత సత్యాన్ని అనుభవాల ద్వారా....తెలుసుకున్న
వ్యక్తి చంద్రహాస్"
తను భ్రమలో వున్నాడా ? అన్న ప్రశ్న నుంచి బయటకు
వచ్చాడు.శక్తిని కూడదీసుకున్నాడు.మనసులో దైవనామ స్మరణ...చేతుల్లో
ఆత్మవిశ్వాసపు ఆయుధం...పిడికిలి బిగించాడు.తన ఎదురుగా వున్న భీకర ఆకారాన్ని
లక్ష్యంగా చేసుకున్నాడు.
***************
స్టీఫెన్ మొహం స్వేదంతో తడిసిపోయింది.లాప్ టాప్ లో కనిపిస్తోన్న దృశ్యాలు
చూసి ఖంగు తిన్నాడు.తను అమర్చిన కెమెరా లలో కనిపించిన దృశ్యం అతడిని
భయానికి గురి చేసింది.పెద్ద గాలి...ఆ గాలిని చీల్చుకుంటూ ఓ వ్యక్తి
ప్రళయకాల రుద్రుడిలా పరుగెత్తుకు వస్తున్నాడు.అతని చేతిలో కొమ్మ...శివుడి
చేతిలో
త్రిశూలంలా అనిపించింది.
అతడిని ఎక్కడో చూసిన
జ్ఞాపకం...మరియప్ప లాంటి మాంత్రికుడిని ఎదుర్కునే ధర్యం,తెగువ వున్న
వ్యక్తి ఎవరున్నారు?చంద్రహాస్ తప్ప ? మరి ఇతనెవరు ? మృత్యువునే భయపడేలా
చేయగల రౌద్రం అతడి మోహంలో కనిపిస్తోంది. స్మశానంలో మారిన
వాతావరణం...మరియప్ప మోహంలో బాధ కనిపిస్తోంది.
*****************
చతుర్వేది వైజాగ్ చేరుకున్నాడు.చంద్రహాస్ నుంచి వచ్చిన చివరి కాల్ వైజాగ్
నుంచే...సేక్యూరితీచీఫ్ మెహతా కు సంబంధించిన వివరాలు తెలిసాయి.మేన్ రోబో
నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది.చంద్రహాస్ చీఫ్ ఎడిటర్ తో
మాట్లాడాడు....రిపోర్టర్ సంధ్యాజ్యోతి మెహతాను ట్రాప్ చేసింది.వైజాగ్ లో
వున్న సారథి చంద్రహాస్ గురించి వెతుకుతూనే వున్నాడు.ప్రణవి సేఫ్ అన్న విషయం
తెలిసింది.
ఇప్పుడు తెలియవలిసింది చంద్రహాస్ గురించి. చతుర్వేదికి ఒక నమ్మకం..చంద్రహాస్ మృత్యువుని ఎదురించగల వ్యక్తి అని...
అంత కన్నా మరో ధైర్యం కార్తికేయ...దేశాన్ని ఉగ్రవాదం బారి నుంచి
కాపాడడమే కాదు..ఒక ప్రమాదకరమైన మిస్సయిల్ లాంటి మోహన ను దేశానికి పనికి
వచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దిన కార్తికేయ తమకు అండగా వున్నాడు.
మరియప్ప పెదవులు చివరి క్షుద్ర మంత్రాన్ని
ఉచ్చరించబోతున్నాడు.గాలిని చీల్చుకుంటూ వచ్చిన కార్తికేయ ...సమాధుల మీద
వున్న ముగ్గుని,ముగ్గు మధ్యలో వున్న పిండి బొమ్మను తన చేతిలోని కొమ్మతో
దూరం గా నేట్టేసాడు. ఎడమకాలితో మరియప్ప గుండెల మీద తన్నాడు. మరియప్ప
ఊహించని పరిణామం..
నిక్శూచి సమాదిలోనుంచి లేచే చివరిక్షణం లోని పదవ
వంతు...ఆకాశం పెద్దగా ఉరిమింది.మెరుపులు...నిక్శూచి ఆగమనాన్ని అడ్డుకునే
హోరుగాలి....ప్రేతాత్మలు కకావికలమవుతున్నాయి. అప్పుడు జరిగిందా సంఘటన ...
***************
(ఏమిటా సంఘటన ?రేపటి సంచికలో )
No comments:
Post a Comment